టీడీపీలో ఆ ప‌ద‌వి కోసం రంగంలోకి బాల‌య్య‌... బాబు ఒప్పుకుంటారా..?

గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే సంస్థాగ‌తంగా కుదురుకుంటోంది.ఇటీవ‌లే పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వర్గాల వారీగా అధ్య‌క్షుల‌ను , పార్టీ నేత‌ల‌ను నియ‌మించ‌డంతో పాటు పార్టీలో రాష్ట్ర క‌మిటీని పూర్థి స్థాయిలో కూర్పు చేసి నియ‌మించారు.

 Balayya Entered The Field For That Position In Tdp ,will Babu Agree,ap,ap Politi-TeluguStop.com

ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు ఏకంగా 60 శాతానికి పైగా ప‌ద‌వుల‌ను కేటాయించారు.దాదాపు ప్ర‌తి వ‌ర్గానికి, ప్ర‌తి ప్రాంతానికి ప‌ద‌వులు ఉండేలా ప్లాన్ చేశారు.

పార్టీ ప‌ద‌వులు వ‌చ్చిన వారు ఇప్ప‌టికే తిరుప‌తి పార్ల‌మెంటు స్తానానికి జ‌రిగే ఉప ఎన్నిక‌ల ప్ర‌చారానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

ఇక పార్టీలో చాలా ప‌ద‌వులు భ‌ర్తీ చేస్తూ వ‌స్తోన్న చంద్ర‌బాబు కీల‌క‌మైన తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌ద‌విని మాత్రం అలాగే ఉంచారు.

పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడే ఈ ప‌ద‌విని ఎవ‌రికి ఇవ్వాలా ? అన్న అంశంపై నాన్చుతూ వ‌చ్చిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందే దేవినేని అవినాష్‌కు అప్ప‌గించారు.ఎన్నిక‌ల్లో గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవినాష్ ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు.

అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు యువ‌త ప‌ద‌వి ఖాళీగానే ఉంది.

Telugu Ap, Bala Krishna, Balayya, Chandra Babu, Mlas, Tdp-Telugu Political News

దీంతో ఈ ప‌ద‌వి ఎవ‌రికి ఇస్తారా ? అన్న అంచ‌నాలు ఉన్నాయి.పార్టీలో ప‌లువురు కీల‌క నేత‌ల‌తో పాటు వార‌సులు కూడా ఈ ప‌ద‌వి కోసం ఆశ‌తో ఉన్నారు.అయితే పార్టీలో కీల‌క‌మైన ప‌ద‌వి కోసం పార్టీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ కొంద‌రి పేర్లు చంద్ర‌బాబుకు సిఫార్సు చేశార‌ని తెలుస్తోంది.ఈ ప‌ద‌వి కోసం కృష్ణా, గుంటూరు, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన పార్టీ యువ‌నేత‌ల పేర్లు వినిపిస్తుండ‌గా.

బాల‌య్య విజ‌య‌న‌గ‌రం జిల్లాకు

చెందిన ఓ యువ‌నేత పేరు కూడా సిఫార్సు చేసిన‌ట్టు టాక్‌.?

బాల‌కృష్ణే స్వ‌యంగా రంగంలోకి దిగ‌డంతో ఈ ప‌ద‌వి కోసం రేసులో ఉన్న వారిలో చాలా మంది ముందుకు వెళ్లాలా ? వ‌ద్దా ? అని త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.అయితే బాల‌య్య సిఫార్సుల‌ను బాబు ఎంత వ‌ర‌కు ఓకే చేస్తార‌న్న‌ది కూడా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube