అఖండ సినిమా కోసం బాలయ్య మాములు కష్టం పడలేదు.. థమన్ కామెంట్స్ వైరల్?

Balayya Did So Hard Work For Akhanda Movie Thaman Comments Viral

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు.

 Balayya Did So Hard Work For Akhanda Movie Thaman Comments Viral-TeluguStop.com

ప్రస్తుతం బాలయ్య యంగ్ హీరోలతో పోటీ గా వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

 Balayya Did So Hard Work For Akhanda Movie Thaman Comments Viral-అఖండ సినిమా కోసం బాలయ్య మాములు కష్టం పడలేదు.. థమన్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది.

ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా వచ్చే నెల 2న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన బాలయ్య కష్టం గురించి తమన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఈ సినిమా కోసం బాలయ్య చాలా కష్టపడ్డాడని తెలిసింది.

ఈ వయసులో కూడా బాలయ్య యాక్షన్ సీన్ లలో బాగా నటించాడని తెలిపాడు.

ఈ యాక్షన్ సన్నివేశాల కోసం బాలయ్య రెండు మూడు బెల్టులు కట్టించుకుని, కింద మీద పల్టీలు కొట్టి బాగా రిస్కు చేశాడని తెలిపాడు.

ఇక వేడి లైట్ల మధ్యలో తన ఒంటి నిండా విభూతి నామాలు పెట్టుకొని, భారీ గొలుసులు, దండలు ధరించి ప్రతిరోజు ఈ గెటప్ లో ఉండటం చాలా ఓపిక అని అన్నాడు.

Telugu Akhanda, Bala Krishna, Balakrishna Akhand Amovie, Balakrishna Hard Work, Boyapati Srinu, Comment, Film Industry, Hero, Ss Thaman, Thaman, Tollywood-Movie

సినిమాను బోయపాటి చాలా కసిగా రూపొందించాడని తెలిపాడు.థియేటర్ లో ఈ సినిమా చూసినట్లయితే బాగా థ్రిల్ ఉంటుందని అన్నాడు    తమన్.సినిమాల్లో మంచి బీట్ సాంగ్ ఉందట.

ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా మరో రెండు పాటలు 27 న విడుదల చేస్తామని తెలిపాడు.

Telugu Akhanda, Bala Krishna, Balakrishna Akhand Amovie, Balakrishna Hard Work, Boyapati Srinu, Comment, Film Industry, Hero, Ss Thaman, Thaman, Tollywood-Movie

సినిమాలో జగపతి బాబు, శ్రీకాంత్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు దాదాపు 500 మంది పనిచేయగా ఎక్కువగా సింగర్ లే ఉన్నారని తెలిసింది.

భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Akhanda, Bala Krishna, Balakrishna Akhand Amovie, Balakrishna Hard Work, Boyapati Srinu, Comment, Film Industry, Hero, Ss Thaman, Thaman, Tollywood-Movie

మొత్తానికి ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా నందమూరి అభిమానులు సంతోషంగా ఉన్నారు.ఈ సినిమాలతో పాటు బాలయ్య మరిన్ని సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

అంతేకాకుండా అనిల్ రావిపూడి దర్శకత్వం లో పక్క మాస్ లుక్ తో ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ లో నటించనున్నాడు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో మరో సినిమా చేయనున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, దిల్ రాజు బ్యానర్ లో వర్షం సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.వీళ్లే కాకుండా డైరెక్టర్ సి కళ్యాణ్ తో, రాజ్ కందుకూరి తో కూడా సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

#Balakrishna #Thaman #Thaman #Akhanda #Bala Krishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube