ఎన్నికల ప్రచారంలో జగన్ పై విమర్శలు చేసిన బాలయ్య..!!

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు తాజాగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోపక్క క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు.తెలిపిన బాలయ్య బాబు రెండు సంవత్సరాల పరిపాలనలో వైసీపీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చెప్పాలి అంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అభివృద్ధిని పక్కనపెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు అంటూ జగన్ ని బాలయ్య బాబు విమర్శించారు.కనీసం ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులకు కూడా సీఎం అపాయింట్మెంట్ దొరకటం లేదని ఆరోపించారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో … పేదలకు ఎంతగానో ఉపయోగపడిన అన్నా క్యాంటీన్లు.

మూసివేసి వైసిపి పేదల కడుపు కొట్టిందని మండిపడ్డారు.వైసీపీలో ఉన్న నలుగురు మంత్రులు కేవలం చంద్రబాబునే విమర్శించడానికి పనిగా పెట్టుకున్నట్లు బాలయ్య బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

  .

#YS Jagan #Balakrishna #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు