సంబరాల కోసం సిద్ధం అవుతున్న బాలయ్య ఫ్యాన్స్ !

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు దగ్గర పడడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.మామూలుగానే నందమూరి అభిమానులు ఏదైనా అప్డేట్ వస్తేనే నానా హంగామా చేస్తారు.

 Balayya Birthday Surprise To His Fans-TeluguStop.com

అలాంటిది ఇప్పుడు జూన్ 10 న బాలయ్య పుట్టిన రోజు వస్తుండడంతో ఎలా సెలెబ్రేట్ చెయ్యాలా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా పుట్టిన రోజు అనగానే ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల నుండి ఏదొక సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

 Balayya Birthday Surprise To His Fans-సంబరాల కోసం సిద్ధం అవుతున్న బాలయ్య ఫ్యాన్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కూడా బాలయ్య నుండి ఎలాంటి సుర్ప్రైజ్ లు వస్తాయో అని ఎదురు చూస్తున్నారు.బాలయ్య కూడా ఫ్యాన్స్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సర్ప్రైజ్ లు ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

అందులో మొదటిది అఖండ సినిమా నుండి రాబోతున్నట్టు టాక్.యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Telugu Akhanda, Akhanda Movie, Anil Ravipudi, Balakrishna, Balakrishna Fans, Balakrishna Three Surprises, Balayya Birthday Surprise To His Fans, Balayya Birthday Surprises, Balayya Latest Movies, Boyapati Srinu, Gopichand Malineni, Tollywood-Movie

ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక సర్ప్రైజ్ రాబోతుందని తెలుస్తుంది.ఇక రెండవ సర్ప్రైజ్ ఏంటంటే గోపీచంద్ మలినేని తో చేసే సినిమా నుండని తెలుస్తుంది.

ఈ కాంబినేషన్ లో దాదాపు సినిమా కన్ఫర్మ్ అయ్యింది.

ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.బాలయ్య పుట్టిన రోజుకు ఈ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Telugu Akhanda, Akhanda Movie, Anil Ravipudi, Balakrishna, Balakrishna Fans, Balakrishna Three Surprises, Balayya Birthday Surprise To His Fans, Balayya Birthday Surprises, Balayya Latest Movies, Boyapati Srinu, Gopichand Malineni, Tollywood-Movie

తర్వాత మూడవ సర్ప్రైజ్ కూడా బాలయ్య అప్ కమింగ్ సినిమా గురించే ఉండబోతుందని తెలుస్తుంది.అనిల్ రావిపూడి తో సినిమా చేయబోతున్నట్టు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆ ప్రకటన ఇప్పుడు రాబోతున్నట్టు టాక్.మరి చూడాలి మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కు ఎన్ని సర్ప్రైజ్ లు ఇస్తాడో.

#Boyapati Srinu #Anil Ravipudi #BalayyaBirthday #Balakrishna #BalayyaBirthday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు