టాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
కాగా ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి ( Veera Simha Reddy )సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమా భగవత్ కేసరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.

అలాగే ఈ మధ్య కాలంలో ఓటీటీలో కూడా దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.బాలయ్య బాబు అనిల్ రావిపూడి ( Anil Ravipudi )కాంబినేషన్ లో రూపొందుతున్న భగవత్ కేసరి సినిమా దసరాకి విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అనీల్ రావిపూడి తెలంగాణా యాసలో బాలయ్య మాట్లాడించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారి అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే ఇటీవలే మూవీ మేకర్స్ ఈ మూవీ నుంచి సాలిడ్ టీజర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతారంలో కనిపించాడు.తెలంగాణలో బాలయ్య డైలాగ్స్ చెప్తుంటే నందమూరి ఫాన్స్ లో కొత్త జోష్ వచ్చింది.

బాలయ్య మార్క్ హీరోయిజం చూపిస్తూనే తన మార్క్ ఫన్ ఉండేలా జాగ్రత్త పడుతున్న అనిల్ రావిపూడి, భగవంత్ కేసరి టీజర్ తో అందరినీ మెప్పించాడు.మొత్తానికి భగవత్ కేసరి సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని బాలయ్య బాబు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ అంచనాలను అందుకోవడానికి అనిల్ రావిపూడి అండ్ టీమ్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.
జనరల్ గా డబుల్ కాల్ షీట్ పేమెంట్స్ ఉంటాయని ఆదివారం షూటింగ్స్ జరగవు, దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా భగవంత్ కేసరి షూటింగ్ చేస్తున్నారు.ఇదే జోష్ లో షూటింగ్ కి ఎండ్ కార్డ్ వేసి ప్రమోషన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేయాలనేది మేకర్స్ ప్లాన్.
భగవంత్ కేసరి షూటింగ్ అయిపోగానే బాలయ్య, డైరెక్టర్ బాబీతో అనౌన్స్ చేసిన సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు.ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే చాలా స్పెషల్ గా మలిచాడట బాబీ.