బాలయ్య – నాగబాబు ల వార్ ఎఫెక్ట్… ఆ హీరోల స్నేహంపై పడిందా…?  

Balayya Babu Nagababu Ntr - Telugu Balayya Babu, Nagababu, Ntr, Ram Charan, Rrr, Telugu Film Industry Issue

టాలీవుడ్ లో నందమూరి నట సింహం బాలకృష్ణ మరియు మెగా బ్రదర్, టవర్ స్టార్ నాగబాబు ల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరుగుతోంది.అయితే గతంలో నందమూరి బాలకృష్ణ సినీ పరిశ్రమలో జరిగేటువంటి పలు కార్యక్రమాలకు మరియు మీటింగులకి తనను ఎవరు పిలవలేదని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో నాగబాబు అందుకు సమాధానం చెబుతూ నందమూరి బాలకృష్ణ నోరు అదుపులో పెట్టు కొమ్మని అంతేగాక అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ చెప్పాలంటూ నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 Balayya Babu Nagababu Ntr

అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇటు నందమూరి అభిమానులు అటు మెగా అభిమానులు బాగానే కొట్టుకుంటున్నారు.ఈ గొడవలో  ఈ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు కూడా కలగ చేసుకుంటున్నట్లు సమాచారం.

అయితే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మాత్రం ఈ గొడవలపై అసలు స్పందించడం లేదు సరి కదా కనీసం పట్టించుకోవడం కూడా లేదు.దీంతో కొంత మంది అభిమానులు సినీ పరిశ్రమలో మాటల గొడవలు అప్పుడప్పుడు జరుగుతుంటాయని అలా అని తమ మధ్య స్నేహాన్ని మరిచి కొట్టుకోవడం సరికాదని కొందరు అభిమానులు అంటున్నారు.

బాలయ్య – నాగబాబు ల వార్ ఎఫెక్ట్… ఆ హీరోల స్నేహంపై పడిందా…-Latest News-Telugu Tollywood Photo Image

మరికొంతమంది మాత్రం ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ, అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బాబాయ్ నాగబాబు ఇద్దరు మాటలు యుద్ధంలో పాల్గొంటున్నప్పటికీ ఈ విషయం తారక్ చరణ్ ల స్నేహం పై ఎలాంటి ప్రభావం చూపదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తారక్ మరియు చరణ్ ఇద్దరూ కలిసి టాలీవుడ్ జక్కన్న ఎస్.

ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్.ఆర్ ఆర్ అనే చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు.కాగా జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలె టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కానీ చరణ్ మాత్రం ప్రస్తుతం పలు చిత్రాల నిర్మాణ పనులలో బిజీగా ఉండడంతో తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balayya Babu Nagababu Ntr Related Telugu News,Photos/Pics,Images..

footer-test