చెల్లెలి మృతి.. సెల్ఫీ అడిగిన అభిమాని.. కొట్టకుండా వదిలేసిన బాలయ్య!?

తాజాగా నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.స్వర్గియ నటుడు నందమూరి తారక రామారావు గారి చిన్న కుమార్తె బాలకృష్ణ సోదరి అయిన కంటమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే.

 Balayya Babu Fan Asked A Selfie At His Sister Uma Meheshwari House Details, Bal-TeluguStop.com

ఉమామహేశ్వరి మరణంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.ఆమె మరణవార్త విని నందమూరి కుటుంబ సభ్యులతో పాటుగా నందమూరి అభిమానులు కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.

కాగా ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని సందర్శించడం కోసం నందమూరి కుటుంబ సభ్యులు బంధువులు అలాగే పలువు సెమీ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

నందమూరి బాలకృష్ణ కూడా అక్కడే చాలా సమయం గడిపారు.

బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా అక్కడే చాలాసేపు ఉన్నారు.అప్పుడు బాలకృష్ణ ఏదో పని మీద వెళ్లడానికి కారు వద్దకు వెళ్లాడు.

ఈ క్రమంలోని బాలకృష్ణ బయటకు రావడంతో ఆయన చుట్టూ మీడియా వాళ్ళు కెమెరాలు పట్టుకుని తిరిగారు.అయితే అటువంటి విషాదకర పరిస్థితులలో కూడా ఒక అభిమాని బాలయ్యను సెల్ఫీ కోసం పిలిచాడు.

అయితే సొంత సోదరీ చనిపోయింది అన్న బాధలో బాలయ్య ఉండగా అతని సెల్ఫీ కోసం ఆ అభిమాని ఎలా పిలిచాడు అన్నది ఎవరికి అర్థం కావడం లేదు.

ఆ సమయంలో బాలకృష్ణ కూడా రచ్చ చేయకుండా కామ్ గా కారు ఎక్కి వెళ్లిపోయాడు.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోని చూసిన బాలయ్య అభిమానులు బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకుంటాడు అని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటారు కదా మరి ఇలా అర్థంపర్థం లేకుండా ప్రవర్తిస్తే వాళ్ళయ్యకు కోపం రాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం ఆ అభిమాని టైం బాగుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube