అఖండ గా వస్తున్న బాలయ్య బాబు..!- Balayya Babu Coming As Akhanda

Balayya Babu coming as "Akhanda", akhanda, treaser, realesed, bb3, boyapati srinu, youtube, viral , balayya - Telugu Akada, Ballaya, Bb3, Boyapati Srinu, Realesed, Treaser, Viral, Youtube

నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి తో కలిసి మూడో సినిమా తెరకెక్కిస్తున్న మూడో సినిమా గురించి అందరికీ తెలిసిందే.ఈ సినిమాకు బిబి 3 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

 Balayya Babu Coming As Akhanda-TeluguStop.com

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ లో ఇదివరకు సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ప్రస్తుతం రాబోతున్న సినిమాపై నందమూరి అభిమానులలో పెద్దఎత్తున ఆసక్తి నెలకొని ఉంది.కేవలం బాలయ్య బాబు అభిమానులకు మాత్రమే కాకుండా దర్శకుడు బోయపాటి శ్రీను అభిమానులకు కూడా ఎక్కడా తగ్గకుండా మాస్ ఎలిమెంట్స్ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

బీబీ3 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు తెలిపిన సంగతి తెలిసిందే.

 Balayya Babu Coming As Akhanda-అఖండ గా వస్తున్న బాలయ్య బాబు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.ప్లవ నామ సంవత్సర ఉగాది ని పురస్కరించుకుని తాజాగా బాలయ్య సినిమా టైటిల్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్.

ఈ మేరకు సినిమాకు సంబంధించిన టైటిల్ ను విడుదల చేయడంతో పాటు టీజర్ ను కూడా విడుదల చేశారు.ఈ సినిమాకి అఖండ అనే ఓ పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం.అందులో ఒక పాత్ర అఘోర గా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలయ్య బాబుకు ప్రతినాయకుడిగా హీరో శ్రీకాంత్ నటించనున్నాడు.బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే చిత్రబృందం ప్రేక్షకులకు తెలపండి ఉన్నారు.ఇక ఈ సినిమా మూవీ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నారు బాలయ్య బాబు.

#Boyapati Srinu #Treaser #Akada #Viral #Ballaya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు