నాన్న ఇంకా ఐసీయూలోనే ఉన్నారు

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న విషయం తెల్సిందే.ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వారం రోజుల క్రితం ఐసీయూలో చేర్చారు.

 Sp Charan Comments About His Father Health, Balasubramanyam, Coronavirus,charan,-TeluguStop.com

ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌ ఇస్తున్నారు.వెంటిలేటర్‌ ద్వారా ఆయనకు శ్వాసను అందిస్తున్నారు.

ఆయన పరిస్థితి కాస్త సీరియస్‌గానే ఉందంటూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో ఆయన తనయుడు చరణ్‌ నాన్న ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు అంటూ పేర్కొన్నాడు.

నిన్న ఉదయం ప్రముఖ మీడియా సంస్థ బాలు గారు కోలుకుంటున్నారు.ప్రస్తుతం ఆయన్ను ఐసీయూ నుండి సాదారణ రూంకు మార్చేందుకు సిద్దం అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి.

కొన్ని మీడియా సంస్థల్లో ఏకంగా ఐసీయూ నుండి బాలు గారు బయటకు వచ్చేశారు అంటూ కథనాలు వచ్చాయి.దాంతో బాలు గారి గురించి ఆయన తనయుడు మరో వీడియోను షేర్‌ చేశాడు.

మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు.ఇంకా నాన్న ఐసీయూలోనే ఉన్నారు అంటూ తేల్చి చెప్పారు.

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నా కూడా కండీషన్‌ మాత్రం క్రిటికల్‌గానే ఉందంటూ వైధ్యులు చెబుతున్నారు.గత మూడు రోజులుగా ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని చరణ్‌ కూడా చెప్పుకొచ్చాడు.

సినీ ప్రముఖులు మరియు ఆయన అభిమానులు బాలు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.ఆయన త్వరలోనే లేచి వస్తాడని ఇళయరాజా ఇటీవలే అన్నారు.ఇక చిరంజీవి కూడా అన్నా త్వరగా నువ్వు కోలుకుని వస్తావని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube