కరోనా వల్ల బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం... చరిత్ర లో తొలిసారి!

కరోనా మహమ్మారి తో తెలంగాణా రాష్ట్రం వణికిపోతున్న విషయం తెలిసిందే.రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

 Balapur Laddu Tender 2020 Cancelled Because Of Covid Pandemic, Balapur Laddu, Ba-TeluguStop.com

ఈ ఏడాది లడ్డూ వేలం పాటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.గణేష్ నిమజ్జనం అంటే నే ప్రతి ఒక్కరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూ వేలం.

ఈ లడ్డూ వేలం కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు.ప్రతి ఏటా కూడా ఈ లడ్డూ ధర లక్షలలో పలుకుతుంది అంటే ఈ లడ్డూ యొక్క ప్రాముఖ్యత ఎంతో అర్ధం అవుతుంది.

ప్రతి ఏడాది కూడా ఈ లడ్డూ వేలం తరువాతే గ్రామంలో శోభా యాత్ర అనేది ప్రారంభమౌతూ ఉంటుంది.అయితే గత కొంత కాలంగా వేధిస్తున్న కరోనా నేపథ్యంలో ఈ సారి ఈ వేలం వేయడానికి కమిటీ వెనకడుగు వేసింది.

భౌతిక దూరం, ప్రతి ఒక్కరూ మాస్క్ వంటి నిబంధనలను పాటిస్తూ ఈ వేలం నిర్వహించడం కష్టంగా భావించిన ఉత్సవ కమిటీ ఇలా ఈ వేలం పాటను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అయితే బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట అనేది మొదలు పెట్టిన తరువాత చరిత్ర లో తొలిసారిగా ఈ వేలం ను రద్దు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ తెలిపింది.ప్రతి ఏడాది కూడా ఈ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చాలా ఘనంగా జరుగుతుంది.

ఈ వేలం లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు పోటీలు పడేవారు.కానీ కరోనా కారణంగా ఈ ఏడాది అంతా మారిపోయింది.లడ్డూ వేలం లేకుండానే నిమజ్జనానికి తరలించారు.ఈ ఏడాది లడ్డూ వేలం పాటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

1994 నుంచి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట అనేది ప్రారంభించగా తొలి ఏడాది రూ.450కి కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకోగా.గతేడాది రూ.17.60 లక్షల రికార్డు ధరకు కొలను రాంరెడ్డి సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది.1994 నుంచి గతేడాది వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ లడ్డూ వేలం అనేది కొనసాగుతూ వస్తుంది.కానీ ఈ సారి మాత్రం కరోనా పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఈ వేలం పాటను రద్దు చేస్తూ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube