బలమెవ్వడు టీజర్ విడుదల..సినిమా పై భారీ అంచనాలను ఏర్పరిచిన టీజర్

ఇటీవలే కాలంలో అందరిలో ఎంతో ఆసక్తి ని కలిగిస్తున్న సినిమా బలమెవ్వడు.తాజాగా ఈ సినిమా కి సంబందించిన టీజర్ విడుదల అయ్యింది.

 Balamevvadu Teaser Released The Teaser That Set Huge Expectations On The Movie-TeluguStop.com

ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరుస్తున్న ఈ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో మంచి స్పందన దక్కించుకుంటుంది.ఈ టీజర్ లో కామెడీ, లవ్ స్టోరీ, మెడికల్ క్రైమ్ ను బాలన్స్ చేస్తూ ఒక పక్కా కమర్షియల్ చిత్రాన్ని తలపించేలా ఉంది.

సరికొత్త కథ కథనాలతో ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసే ఎన్నో అంశాలు ఈ చిత్రంలో ఉన్నట్లు ఈ టీజర్ ను బట్టి తెలుస్తుంది.

 Balamevvadu Teaser Released The Teaser That Set Huge Expectations On The Movie-బలమెవ్వడు టీజర్ విడుదల..సినిమా పై భారీ అంచనాలను ఏర్పరిచిన టీజర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ది.

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరో హీరోయిన్ లుగా సత్య రాచకొండ దర్శకత్వంలో సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మాతగా చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు టీజర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్ వంటి సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో నటించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు.

పెద్ద సినిమా లకు సరిసమానంగా మణిశర్మ ఈ సినిమా కి సంగీతం సమకూర్చడం విశేషం.ఈ సినిమా లో లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఓ పాట ఆలపించడం విశేషం.

త్వరలోనే ఈ సినిమా కి సంబందించిన విడుదల తేదీ ని ప్రకటించనున్నారు మేకర్స్.

#Balamevvadu #Markandeyu #Dhruvan Katakam #Nia Tripathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు