‘ఎన్టీఆర్‌’కు డబుల్‌ లాభం.. బాలయ్య పంట పండినట్లే!   Balakrishna's NTR Biopic Gets 100 Cr Pre Release Business     2018-10-06   11:22:46  IST  Ramesh P

తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రంను రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం బిజినెస్‌ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొదటి పార్ట్‌ మరియు రెండవ పార్ట్‌కు కలిపి భారీగా నిర్మాత బాలకృష్ణ లాభాలను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంను 40 నుండి 45 కోట్ల మద్య బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రొడక్షన్‌ వర్క్‌ చకచక జరుగుతుంది. ఇదే సమయంలో సినిమాను రెండు పార్ట్‌లుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు కనుక సినిమాకు అన్ని విధాలుగా డబుల్‌ లాభం అంటున్నారు. అన్ని రకాల బిజినెస్‌ల ద్వారా రెండు పార్ట్‌లకు కలిపి దాదాపు 100 కోట్ల మేరకు వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.

100 కోట్ల బిజినెస్‌ చేయడం బాలయ్య కెరీర్‌లో ఇదే ప్రథమం. ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతున్న నేపథ్యంలో రెండు పార్ట్‌లను కూడా ఒకే డిస్ట్రిబ్యూటర్‌కు, ఒకే ఛానల్‌కు ఇస్తున్నారు. మొదటి పార్ట్‌ ఏదైతే థియేటర్‌లో విడుదల అయ్యిందో రెండవ పార్ట్‌ కూడా అలాగే విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. బాలయ్యకు ఈ చిత్రంతో విడుదలకు ముందే 50 కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ ఖాయం అంటున్నారు.

Balakrishna's NTR Biopic Gets 100 Cr Pre Release Business-

బాలయ్య లాభాల్లో దర్శకుడు క్రిష్‌కు వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అంటే లాభం 50 కోట్లలో కనీసం 15 కోట్ల మేరకు దర్శకుడు క్రిష్‌కు వెళ్లే అవకాశం ఉంది. సినిమాకు ఒక మోస్తరు టాక్‌ వచ్చినా కూడా రెండు పార్ట్‌లు కలిపి భారీగానే రాబట్టే అవకాశం ఉంది. అందుకే ఈ చిత్రం బాయ్యకు పంట పండ్డించినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.