బావయ్య కు అండగా బాలయ్య ? 

ఇటీవల వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో మళ్లీ నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.మొన్నటి వరకు అధికార పార్టీ వైసీపీ పై వ్యతిరేకత పెరిగిందని,  టిడిపి నాయకుల్లో జోష్ మరింతగా పెరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమాగా ఉంటూ వచ్చారు.

 Balakrishna Stands For Chandrababu, Zptc And Mptc Elections,balakrishna, Nandanu-TeluguStop.com

అయితే ఎన్నికల ఫలితాల తరువాత ఒక్కసారిగా పరిస్థితి మారింది.జగన్ ప్రభంజనం కొనసాగుతోంది.

పైకి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినట్టుగా కనిపించినా, క్షేత్రస్థాయిలో మాత్రం జగన్ పై ఇంకా జనాలో అభిమానం ఉందనే సంకేతాలు వెలువడటంతో, చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే ఒక వైపు బిజెపి, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

  అలాగే తన బావ మరిది, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను రంగంలోకి దించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే బాలయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలని చూస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం పై తనదైన శైలిలో విరుచుకుపడా లి అని, టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా టిడిపిలో ఎదగాలనే లక్ష్యంతో బాలయ్య ఉన్నారట.

 ప్రస్తుతం పార్టీ సీనియర్ నాయకులు వల్ల పెద్దగా ఉపయోగం లేకపోవడం , లోకేష్ కు రానున్న రోజుల్లో గట్టి అండదండలు కావాల్సి రావడం,  ఇవన్నీ ఆలోచించుకుని బాలయ్యను రంగంలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

Telugu Balakrishna, Chandrababu, Hindupuram, Lokesh, Mla Balakrishna, Nandanuri,

 బాలయ్య రంగంలోకి దిగితే అదే పని టీడీపీపై విమర్శలు చేస్తున్న కొడాలి నాని వంటి వారికి గట్టి కౌంటర్ ఇవ్వడంతోపాటు, జగన్ పైన బాలయ్య  తో ఇప్పించేందుకు అప్పుడే వ్యూహ రచన  చేస్తున్నారట.తాను పార్టీలో యాక్టివ్ గా ఉన్నా, లేకపోయినా, తన మాదిరిగానే బాలయ్య లోకేష్ కు అండదండలు అందిస్తారు అనే అభిప్రాాయానికి బాబు వచ్చినట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube