పరువు నిలుపుకున్న బాలయ్య  

Balakrishna Win In Hindhupur బాలయ్య-chandra Babu Naidu,cm Ys Jagan,mla Balakrishna,tdp,tdp Mla,సి‌ఎం జగన్

ఏపీలో వైకాపా ప్రభంజనం సృష్టించింది. ఇద్దరు మంత్రులు మినహా అందరు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇలాంటి సమయంలో బాలకృష్ణ గెలవడం నూటికి నూరు శాతం కష్టమే అనుకున్నారు..

పరువు నిలుపుకున్న బాలయ్య-Balakrishna Win In Hindhupur బాలయ్య

కాని అనూహ్య పరిణామాల్లో బాలకృష్ణ మంచి మెజార్టీతో గెలుపొందడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నుండి పోటీ చేసిన విషయం తెల్సిందే.మొదటి నుండి కూడా టీడీపీకి కంచు కోటగా హిందూపురం ఉంటూ వచ్చింది.

అందుకే టీడీపీకి అక్కడ మరోసారి చోటు దక్కింది. బాలకృష్ణ పలు సందర్బాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు అనేక సందర్బాల్లో కూడా ఆయనపై హిందూపురం స్థానికులు విమర్శలు చేయడం జరిగింది. బాలకృష్ణ అందుబాటులో ఉండటం లేదని, సినిమాలంటూ తిరుగుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే జనం ఇప్పుడు మరోసారి బాలయ్యకు పట్టం కట్టడం జరిగింది.ఎంతో మంది మహా మహులు ఓడిపోయిన ఈ సమయంలో బాలకృష్ణ గెలవడం ఆయన అభిమానులు మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆనందంను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చంద్రబాబు నాయుడు ఈసారి గెలిస్తే బాలకృష్ణకు మంత్రి పదవి ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

కాని బాలయ్య గెలిచినా తెలుగు దేశం పార్టీ అధికారంను దక్కించుకోక పోవడంతో బాలయ్యకు మంత్రి పదవి అందని ద్రాక్షే అయ్యింది.