టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి తరం దర్శకుడిగా గుర్తింపు పొందిన గీత కృష్ణ ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో తరచూ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొని సినీ ఇండస్ట్రీ గురించి సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ క్రమంలోని తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్నాయి.
ఈయన వ్యాఖ్యలపై బాలయ్య అభిమానులు గీతాకృష్ణ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలలో ఎవరు గొప్ప అనే ప్రశ్న ఈయనకు ఎదురైంది.
ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ…ఎవరు గొప్ప ఏంట్రా స్టుపిడ్ ఇప్పటికే చిరంజీవి గొప్ప అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు.అంటూ చిరంజీవి గురించి వెల్లడించారు.చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో సక్సెస్ సాధించారు.ఈయన మట్టిలో పుట్టిన మాణిక్యం.
ఇక బాలకృష్ణ ఎన్ టి రామారావు గారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చినాడు.బాలకృష్ణ ఎప్పుడు కూడా చిరంజీవి స్థాయికి చేరుకోలేడు.ఇక జై బాలయ్య అనే మూమెంట్ ఎందుకు వచ్చింది.వాడెవడో డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి.కాబట్టి దాని తర్వాత అందరూ కాలర్ ఎగరేసి జై బాలయ్య అంటున్నారు.బాలకృష్ణకు కొంత కాలం మాత్రమే నడుస్తుంది కానీ చిరంజీవి స్థాయిని ఎప్పుడు బాలకృష్ణ బీట్ చేయలేడు అంటూ గీతాకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం బాలయ్య అభిమానులకు తీవ్రస్థాయిలో ఆగ్రహం తెప్పిస్తున్నాయి.