బాలయ్య భార్య సంతకంతో మోసం  

Balakrishna Wife Vasundara Devi Signature Forged - Telugu Balakrishna, Signature Forgery, Telugu Movie News, Vasundara Devi

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కొంత గ్యాప్ తరువాత బాలయ్య చేస్తు్న్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెపపుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Balakrishna Wife Vasundara Devi Signature Forged - Telugu Balakrishna, Signature Forgery, Telugu Movie News, Vasundara Devi-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా తాజాగా ఆయన భార్య వసుంధరా దేవి సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి పేరిట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బంజారా హిల్స్ శాఖకు ఓ వినతి పత్రం అందిందని, అందులో తన బ్యాంక్ ఖాతాకు మొబైల్ బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభించాలని కోరినట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు.

కాగా ఇదే విషయమై వసుంధర పీఏకు ఫోన్ చేస్తే, ఆమె ఎలాంటి వినతిపత్రం అందించలేదని తేలింది.దీంతో బ్యాంకులో పనిచేసే కొర్రి శివ అనే ఉద్యోగి ఈ సంతకం ఫోర్జరీ చేసినట్లు బయటపడింది.

కాగా వసుంధర పీఏ ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.సంతకం ఫోర్జరీ కేసు కింద అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు.

తాజా వార్తలు