అమ్మ బాబోయ్.. బాలయ్య కోసం అరాచకమైన విలన్?  

Balakrishna Wants Vivek Oberoi As Villain, Balakrishna, Vivek Oberoi, Boyapati Sreenu, Vinaya Vidheya Rama, BB3 - Telugu Balakrishna, Bb3, Boyapati Sreenu, Vinaya Vidheya Rama, Vivek Oberoi

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించే చిత్రాలు ఎలాంటి మాస్ అంశాలను కలిగి ఉంటాయో అందరికీ తెలిసిందే.ఆయన సినిమాల్లో హీరోలను ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తాడో, విలన్ పాత్రను కూడా అదే స్థాయిలో చూపిస్తాడు.

TeluguStop.com - Balakrishna Wants Vivek Oberoi As Villain

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక విలనిజంను మరింత పీక్స్‌కు తీసుకెళ్లడంతో బోయపాటి తనదైన మార్క్ వేస్తూ వస్తున్నాడు.కానీ కొన్ని సార్లు ఆయన విలన్‌లు చూపించే విధానం ప్రేక్షకులను నవ్వించడంతో పాటు తలనొప్పి కూడా తెచ్చిపెట్టింది.

TeluguStop.com - అమ్మ బాబోయ్.. బాలయ్య కోసం అరాచకమైన విలన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇలాంటిదే బోయపాటి గతచిత్రం ‘వినయ విధేయ రామ’లో జరిగింది.ఆ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ను చూపించిన విధానం ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది.ఇక ఆ సినిమాలో ఓ సన్నివేశంలో విలన్ పాముతో కాటేయించుకుంటే ఆ పాము చనిపోవడంతో ప్రేక్షకులు నవ్వాలో ఏడవాలో అర్ధంగాని పరిస్థితి ఏర్పడింది.ఇక ఇప్పుడు మరోసారి ఈ విలన్‌తో రచ్చ చేసేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడట.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.కాగా ఈ సినిమాలో విలన్‌గా వివేక్ ఒబెరాయ్ అయితే బాగుంటుందని బాలయ్య సజెస్ట్ చేశాడట.

దీంతో మరోసారి వివేక్‌ను విలన్‌గా తీసుకునేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.మరి ఈసారైనా వివేక్‌ను విలన్‌గా బోయపాటి పవర్‌ఫుల్‌గా చూపిస్తాడా లేక మళ్లీ ఏదైనా అతిగా చేస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

#Vivek Oberoi #Boyapati Sreenu #Balakrishna #VinayaVidheya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Wants Vivek Oberoi As Villain Related Telugu News,Photos/Pics,Images..