ఇది మరీ ఓవర్‌ బాలయ్య... ఇంత ఖర్చు అవసరమా?  

Balakrishna Wants To Put Ntr Statue At Ntr Biopic Releasing Places-director Krish,ntr Biopic,ntr Biopic Release Date,ntr Statue,ntr Statue At Ntr Biopic Releasing Places

మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్‌ మూవీ విడుదల కాబోతుంది. బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి, నటించిన ‘ఎన్టీఆర్‌’ మూవీ సంక్రాంతి సీజన్‌ను ప్రారంభించబోతుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన కారణంగా ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్బుతమైన టెక్నికల్‌ అంశాలతో పాటు, అద్బుతమైన తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాలకృష్ణ ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాకుండా ఈ చిత్రంను నిర్మించాడు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందినట్లుగా చెబుతున్నారు.

Balakrishna Wants To Put NTR Statue At Biopic Releasing Places-Director Krish Ntr Release Date Ntr Places

Balakrishna Wants To Put NTR Statue At NTR Biopic Releasing Places

సినిమా విడుదలకు కూడా బాలయ్య భారీగా ఖర్చు చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్‌ కోసం కొత్త, వింత పద్దతులు తీసుకు వస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొంటున్నాడు. ప్రమోషన్స్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్న బాలయ్య కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా ప్రదర్శితం అవ్వబోతున్న థియేటర్ల వద్ద ఎన్టీఆర్‌ విగ్రహంను పెట్టబోతున్నాడు.

Balakrishna Wants To Put NTR Statue At Biopic Releasing Places-Director Krish Ntr Release Date Ntr Places

ఎన్టీఆర్‌ విగ్రహాల తయారీకి భారీగా ఖర్చు చేయించినట్లుగా తెలుస్తోంది. మరీ ఇంత ఎక్కువ ఖర్చు చేయడం ఏంటో అంటూ సినీ జనాలు కూడా భావిస్తున్నారు. థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున హంగామా సృష్టించాలని ఫ్యాన్స్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

Balakrishna Wants To Put NTR Statue At Biopic Releasing Places-Director Krish Ntr Release Date Ntr Places

దాంతో పాటు కొంత మొత్తంలో డబ్బు కూడా అందినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య సినిమా విడుదల కోసం కూడా భారీగా ఖర్చు చేస్తున్నాడు. మరీ ఇంత ఖర్చు ఎందుకు బాలయ్య అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రతిష్టాత్మక మూవీ అవ్వడం వల్ల బాలయ్య ఇలా ఖర్చుకు వెనకాడకుండా రెచ్చి పోతున్నాడు.