పరుచూరి బ్రదర్స్‌ను ఆశ్రయించిన బాలయ్య... సక్సెస్‌ గ్యారెంటీనా?  

Balakrishna Wants To A Movie With Paruchuri Brothers-

నందమూరి బాలకృష్ణ సక్సెస్‌ కోసం చకోరా పక్షి తరహాలో ఎదురు చూస్తున్నాడు.ఈ సంవత్సరం ఎన్టీఆర్‌ చిత్రంతో వచ్చిన బాలయ్యకు పరువు పోయినంత పనైంది.తండ్రి బయోపిక్‌ అంటూ భారీగా హైప్‌ క్రియేట్‌ చేసినా, సినిమాకు పాజిటివ్‌గా రెస్పాన్స్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ మాత్రం దారుణంగా నిలిచాయి...

Balakrishna Wants To A Movie With Paruchuri Brothers--Balakrishna Wants To A Movie With Paruchuri Brothers-

ఒక చిన్న హీరో ఫ్లాప్‌ మూవీకి అంతకు మించి కలెక్షన్స్‌ వస్తాయి.అలాంటి పరాజయంను ఎదుర్కొన్న బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ చిత్రం పనుల్లో నిమగ్నమయ్యాడు.

Balakrishna Wants To A Movie With Paruchuri Brothers--Balakrishna Wants To A Movie With Paruchuri Brothers-

బాలయ్య 105వ చిత్రంకు తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.సి కళ్యాణ్‌ ఈ చిత్రంను నిర్మించబోతున్నాడు.ఇప్పటికే ఈ చిత్రంకు ఒక కథ అనుకుంటే దాన్ని మార్చే యోచనలో బాలయ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ రచయితల ద్వయం అయిన పరుచూరి బ్రదర్స్‌తో బాలకృష్ణ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.చిరంజీవి రీ ఎంట్రీ మూవీకి కథా సహకారంను పరుచూరి బ్రదర్స్‌ ఇచ్చారు..

ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్‌ పలు సినిమాలకు కూడా రచన సహకారం అందిస్తూ ఉంటారు.స్క్రిప్ట్‌ వర్క్‌లో పాల్గొనడం తమ అనుభవంను రంగరించడం వంటివి చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో పరుచూరి బ్రదర్స్‌ను తన సినిమా కోసం రంగంలోకి దించాలని బాలకృష్ణ ప్రయత్నిస్తున్నాడు.ఈసారి అయినా బాలయ్యకు సక్సెస్‌ వస్తుందేమో చూడాలి.త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న బాలయ్య 105వ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.