ముసలి హీరో అంటూ తిట్టినా ఆమెనే కోరుకుంటున్న బాలయ్య?

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా ఒక టాక్‌ షోలో మాట్లాడుతూ నాకు 50 ఏళ్లు వస్తే సినిమాల్లో హీరోయిన్‌గా చేయడం మానేస్తాను, కుర్ర హీరోలతో రొమాన్స్‌ చేసేందుకు నేను ఇష్టపడను అంది.సౌత్‌ లో హీరోలను ఉద్దేశించి ఈమె ఈ వ్యాఖ్యలు చేసింది.50 ఏళ్ల వయసు దాటిన వారు కూడా ఇంకా పాతిక ఏళ్ల లోపు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తున్నారంటూ సోనాక్షి వ్యాఖ్యలు చేసింది.ఆ వ్యాఖ్యలు చేసి నెల రోజులు అయ్యిందో కాలేదో ఆమెను బాలయ్య హీరోయిన్‌గా బుక్‌ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Balakrishna Want Sonakshi Sinha For His Next Movie-TeluguStop.com

Telugu Balakrishna, Sonakshisinha-

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీకి ఒక హీరోయిన్‌గా సోనాక్షి సిన్హాను సంప్రదించారట.భారీ పారితోషికంకు టెంమ్ట్‌ అయిన ఆమె ఓకే చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి.ముసలి హీరోలు కుర్ర హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంకా మీడియాలో మారు మ్రోగుతూనే ఉన్నాయి.అయినా కూడా ఆమెకు ఇలాంటి ఆఫర్‌ను బాలయ్య బాబు ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది.

Telugu Balakrishna, Sonakshisinha-

ప్రస్తుతం బోయపాటి శ్రీను ఒక యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్‌ను బాలయ్య కోసం సిద్దం చేస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాయి.అందుకే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.సినిమాకు చెందిన ప్రతి విషయం కూడా సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube