బాలయ్య తో బోయపాటి ఢీ... ఇలాంటి పోటీని మీరెప్పుడు చూసి ఉండరు

నందమూరి బాలకృష్ణ( Balakrishna ) హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఇప్పటి వరకు సింహా.లెజెండ్‌ మరియు అఖండ సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.

 Balakrishna Vs Boyapati Movies For Next Dasara Festival  ,balakrishna  ,sreeleel-TeluguStop.com

ఈ మూడు సినిమాలు కూడా సూపర్‌ హిట్ అయ్యాయి.వీరిది కచ్చితంగా హిట్ కాంబో అనే అభిప్రాయం ఏర్పడింది.

త్వరలోనే అఖండ సినిమా సీక్వెల్‌ కూడా రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలో బాలయ్య సినిమాకు పోటీగా బోయపాటి శ్రీను వెళ్లబోతుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

Telugu Anil Ravipudi, Balakrishna, Boyapati Srinu, Dasara Festival, Ram Pothinen

కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ను ఖరారు చేయలేదు.ఆ సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో క్లారిటీ రాలేదు.కానీ దసరా సందర్భంగా సినిమా విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అదే సమయంలో రామ్‌( Ram Pothineni ) తో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Telugu Anil Ravipudi, Balakrishna, Boyapati Srinu, Dasara Festival, Ram Pothinen

రామ్‌ ఈమధ్య కాలంలో సక్సెస్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.రామ్ మాస్ ఇమేజ్ కి బోయపాటి మాస్ టేకింగ్‌ కు అదిరి పోయేలా సన్నివేశాలు వచ్చి ఉంటాయి.కనుక దసరాకు వీరిద్దరి కాంబో సినిమా హిట్‌ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

దసరా సందర్భంగా అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా బాలయ్య సినిమాకు పోటీ అనడంలో సందేహం లేదు.కనుక ఈ దసరాకు బాలయ్య మరియు బోయపాటి(Boyapati Srinu ) మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

రామ్ వంటి చిన్న హీరో సినిమా అయినా కూడా బోయపాటి వంటి పెద్ద దర్శకుడు సినిమా ను రూపొందించాడు కనుక కాస్త సీరియస్ గానే పోటీ ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube