బాలయ్య అన్‌స్టాపబుల్‌ 3వ ఎపిసోడ్‌ డబుల్‌ ధమాకా

నందమూరి బాలకృష్ణ హీరోగా వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు.అఖండ తర్వాత ఆయన మూడు సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి.

 Balakrishna Unstoppable Show Third Episode , Balakrishna , Unstoppable Show, Aha-TeluguStop.com

సినిమా లతో ఇంత బిజీగా ఉన్న సమయంలో అన్ స్టాపబుల్ అంటూ ఆహా ఓటీటీ లో టాక్ షో ను చేసేందుకు సిద్దం అయ్యాడు.ఇప్పటికే రెండు ఎపిసోడ్‌ లు స్ట్రీమింగ్‌ అయ్యాయి.

మూడవ ఎపిసోడ్‌ కు సంబంధించిన విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.బాలయ్య ఆపరేషన్‌ వల్ల మూడు వారాల పాటు మూడవ ఎపిసోడ్‌ కోసం జనాలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

ఎట్టకేలకు బాలయ్య నుండి మూడవ ఎపిసోడ్‌ వచ్చేసింది.డిసెంబర్‌ మూడవ తారీకున ఆహా లో అన్ స్టాపబుల్‌ మూడవ ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఇంతకు ముందే మేము బాలయ్య అన్‌ స్టాపబుల్‌ మూడవ ఎపిసోడ్ కు బ్రహ్మానందం హాజరు అవ్వబోతున్నట్లుగా చెప్పాము.

Telugu Aha Ott, Anil Ravipudi, Balakrishna, December-Movie

మేము ముందుగా చెప్పినట్లుగానే మాకు అందిన సమాచారం నిజం అన్నట్లుగా అన్‌ స్టాపబుల్‌ లో బ్రహ్మానందం గెస్ట్‌ గా వచ్చాడు.అయితే బ్రహ్మానందంతో పాటు దర్శకుడు అనీల్ రావిపూడిని కూడా తీసుకు వచ్చారు.అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా ను చేసేందుకు కమిట్ అయ్యాడు.

కనుక వీరిద్దరి మద్య ప్రస్తుతం రిలేషన్ కొనసాగుతుంది.ఆ రిలేషన్ తోనే బ్రహ్మానందం మరియు అనీల్‌ రావిపూడిని బాలయ్య పిలిచాడనే వార్తలు వస్తున్నాయి.

బ్రహ్మానందం కామెడీ కి కింగ్‌.ఇక అనీల్‌ రావిపూడి కామెడీ సృష్టికర్త అనడంలో సందేహం లేదు.

అందుకే ఈ మూడవ ఎపిసోడ్‌ ఖచ్చితంగా డబుల్‌ ధమాకా అన్నట్లుగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అఖండ సినిమా డిసెంబర్ 2వ తారీకున థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఆ వెంటనే ఈ ఎపిసోడ్‌ కూడా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube