నందమూరి బాలకృష్ణ( Balakrishna ) ను సరికొత్తగా చూపించిన షో అన్ స్టాపబుల్ సీజన్ 3 కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అన్ స్టాపబుల్ రెండు సీజన్ లకు మంచి స్పందన వచ్చింది.భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో మూడవ సీజన్ ను వెంటనే మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కానీ బాలయ్య రాజకీయ కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం అయినా కూడా మొదటి ఎపిసోడ్ గెస్ట్ చిరంజీవి అంటూ కన్ఫర్మ్ అయింది.

ఇటీవలే అల్లు అరవింద్ ( Allu Aravind )ఈ కాంబోను ఫిక్స్ చేయడం జరిగింది.భారీ అంచనాలు ఉండే ఈ ఎపిసోడ్ ను రెండు పార్ట్ లు గా తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.మొత్తానికి బాలయ్య మరియు చిరంజీవిని ఒకే స్టేజ్ పై అది కూడా అన్ స్టాపబుల్ షో లో చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.గత సీజన్ చివరి ఎపిసోడ్ లో చిరంజీవి హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.
కానీ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో చిరంజీవి( Chiranjeevi ) కనిపించలేదు.మూడవ సీజన్ లో కచ్చితంగా చిరంజీవి ఉండబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అల్లు అరవింద్ ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద దృవీకరించినట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి బాలయ్య( Balakrishna ) అన్ స్టాపబుల్ సీజన్ 3 విషయం లో ఒక క్లారిటీ ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా ను చేస్తున్నాడు.ఆ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
బాలయ్య వరుస సినిమా లతో బిజీగా ఉన్నా కూడా అన్ స్టాపబుల్ షో ను చేసేందుకు గాను రెడీ అయ్యాడు.ఎమ్మెల్యే గా మళ్లీ పోటీ చేసి మూడవ సారి విజయాన్ని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలని బాలయ్య భావిస్తున్నాడు.