మళ్లీ పరువు పోగొట్టుకున్న బాలయ్య.. ఈ వీడియో మూడు నాలుగు సార్లు చూసి నవ్వేసుకోండి  

  • నందమూరి బాలకృష్ణ సినిమాల్లో భారీ డైలాగ్స్‌ అయితే చెప్తాడు కాని, రాజకీయ మీటింగ్‌ లు మరియు ఏదైనా కార్యక్రమాల్లో మాత్రం మాట తడబడుతూ ఉంటుంది. తనకు ఇబ్బంది అయినా కూడా పెద్ద పెద్ద పదాలు పలికేందుకు ప్రయత్నించి పరువు పోగొట్టుకుంటూ ఉంటాడు. తాజాగా బాలకృష్ణ తన అన్న హరికృష్ణ కూతురు సుహాసిని తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. కూకట్‌ పల్లి నియోజకవర్గంలో రోడ్డు షోలు నిర్వహిస్తున్న బాలకృష్ణ ఇప్పటికే పలు సార్లు మాట తడబడటంతో వీడియోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా మరోసారి బాలయ్య అత్యుత్సాహంతో సారేజహాసే అచ్చ అంటూ పాడేందుకు ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డాడు.

  • Balakrishna Tongue Slip While Singing Sare Jahan Se Acha

  • వివరాల్లోకి వెళ్తే… తెలుగు దేశం పార్టీ తరపున రోడ్డు షోలో పాల్గొన్న బాలకృష్ణ స్థానికి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరాడు. ఆ సమయంలోనే తెలుగు దేశం పార్టీ గొప్పదనం చెప్పేందుకు ప్రయత్నించాడు. అందుకోసం సారే జహాసే అచ్చ అంటూ పాట పాడేందుకు ప్రయత్నించాడు. కాని అది పూర్తిగా రాకపోవడంతో దాన్ని తిప్పి తిప్పి, మళ్లీ మళ్లీ పాడి అబాసుపాలయ్యాడు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నాయి. బాలయ్య ఎందుకయ్యా నీకి కష్టం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

  • Balakrishna Tongue Slip While Singing Sare Jahan Se Acha-Singing Acha Telangana Election Campaign
  • బాలకృష్ణ మరీ ఎందుకు ఇలా పరువు పోగొట్టుకుంటున్నాడో అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా అంటున్నారు. సినిమాల్లో డైలాగులు విరగదీసే బాలకృష్ణ ఎందుకు డైరెక్ట్‌గా అయితే డైలాగ్స్‌ చెప్పలేడో ఎవ్వరికి అర్థం కాదు. ఆయన స్పీచ్‌ ఇస్తుంటే సగానికి పైగా పదాలు అర్థం కావు. అయినా కూడా జనాలు ఆయన్ను చూసేందుకు, ఆయన డైలాగ్స్‌ వినేందుకు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఏదో ఒక ఫన్‌ చేస్తాడని, హాయిగా నవ్వుకోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి బాలయ్య సారే జహాసే అచ్చాను కూనీ చేసి జనాలు నవ్వేలా చేశాడు. జనాలు నవ్వితే నవ్వారు కాని తెలుగు దేశంకు ఓటు వేయండి అంటూ ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుతున్నారు.

  • Balakrishna Tongue Slip While Singing Sare Jahan Se Acha-Singing Acha Telangana Election Campaign