కొరటాల నెక్స్ట్ ఫిక్స్.. మరోసారి నందమూరి హీరోతోనే.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్ లలో కొరటాల శివ ఒకరు.ఈయన మొదటి నుండి అందరి కంటే డిఫెరెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధించాడు.

 Balakrishna To Team Up With Film Maker Koratala Siva, Jr Ntr , Koratala Siva , N-TeluguStop.com

ఈయన సామజిక అంశాలను ప్రధానంగా తీసుకుని దానికి కమర్షియల్ హంగుల్ని జోడించి తెరకెక్కిస్తూ ఉంటాడు.ఈయన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ప్రతి సినిమాలో ఒక సామాజిక అంశాన్ని తెరమీదకు తెస్తూ ఉంటాడు.

కొరటాల ఫస్ట్ సినిమా మిర్చి.ఈ సినిమాతోనే కొరటాల డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

 Balakrishna To Team Up With Film Maker Koratala Siva, Jr NTR , Koratala Siva , N-TeluguStop.com

ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి.అయితే ఈయన తన కెరీర్ లో మొదటిసారి ప్లాప్ ఎదుర్కొన్నాడు.

మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు.ఇక ఈ సినిమా విషయాన్నీ పక్కన పెట్టి కొరటాల నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేసాడు.

ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం విదితమే.మరి కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్ లపై ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో నిర్మించ బోతున్నారు.కొరటాల ప్లాప్ వచ్చిందనే పట్టుదలతో మరింత ఫోకస్ పెట్టారు.

తాజాగా కొరటాల నెక్స్ట్ సినిమాపై మరొక గాసిప్ వినిపిస్తుంది.ఈయన మరో నందమూరి హీరోతో సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రెజెంట్ కొడుకు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్న కొరటాల ఇప్పుడు తండ్రితో కూడా ఓకే చెప్పాడట.నందమూరి బాలకృష్ణ తో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అంటూ టాక్.సితార ఎంటర్టైన్మెంట్స్ వారికీ బాలయ్య ఒక మూవీ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు అని బాలయ్యను, శివను కలిపేందుకు సితార వారు ప్రయత్నం చేస్తున్నారు అని తెలుస్తుంది.ఈ లోపు బాలయ్య చేతిలో ఉన్న సినిమాలు పూర్తి అయితే కొరటాలతో సినిమా చేసే అవకాశం ఉంది.

ఇదే జరిగితే మంచి కాంబో సెట్ అయినట్టే.

Balakrishna To Team Up With Film Maker Koratala Siva, Jr NTR , Koratala Siva , NTR30, Balakrishna, Sitara Entertainments - Telugu Balakrishna, Jr Ntr, Koratala Siva, Ntr, Sitara #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube