అరిపించే బాలయ్య ఈసారి ఏడిపిస్తాడా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాలని బాలయ్య చూస్తున్నాడు.

 Balakrishna To Do Emotional Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే పవర్‌ఫుల్ పాత్రల్లో నటిస్తున్న బాలయ్య, త్వరలో ఏడిపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

 Balakrishna To Do Emotional Movie-అరిపించే బాలయ్య ఈసారి ఏడిపిస్తాడా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు ఆయన్ను ఒప్పించింది.

ఈ సినిమాకు సంబంధించిన కథ, దర్శకుడు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.అయితే ఈ సినిమా పూర్తిగా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చూస్తోంది.అందుకోసం ఓ సెంటిమెంట్ సబ్జెక్టును రెడీ చేసిన డైరెక్టర్ కోసం వారు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు, అది ఖచ్చితంగా ప్రేక్షకులను ఏడిపించే విధంగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

సెంటిమెంట్ సీన్స్‌లో బాలయ్య నటన మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఏదేమైనా యాక్షన్‌తో ఇరగదీసే బాలయ్య, ఛేంజ్ కోసం సెంటిమెంట్ కథను ఎంచుకోవడం నిజంగా విశేషమని చెప్పాలి.

ఈ సినిమాలో బాలయ్య నటనతో ప్రేక్షకులను ఏడిపించే డైరెక్టర్ ఎవరా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా పట్టాలెక్కే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.ఇక ఈ సినిమాలో బాలయ్యతో పాటు నటించే నటీనటులు ఎవరనేది కూడా చూడాలి.

కాగా ప్రస్తుతం బాలయ్య అఖండ చిత్రాన్ని ముగించి, తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

#Akhanda #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు