'నర్తనశాల' టికెట్ ధర ఎంతో తెలుసా?

నర్తనశాల.ఈ పేరు వినగానే ఎవరికైన గుర్తొచ్చేది ఎన్టీఆర్ సినిమా.

 Balakrishna's Narthanashala Movie Ticket Price, Sheryas Ett, Nartanashala, Balak-TeluguStop.com

అప్పట్లో తీసిన నర్తనశాల సినిమా ఇప్పటికి ఒక అద్భుతంగా ఉంది.ఎంతోమందికి నచ్చిన.

ఎంతోమంది ప్రేక్షకులు మెచ్చిన సినిమా నర్తనశాల.అలాంటి సినిమాను బాలయ్య బాబు 2004లోనే స్టార్ హీరోయిన్ తో స్టార్ యాక్టర్స్ తో కలిసి తీశాడు.

కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది.అలాంటి ఈ సినిమాను తీసిన భాగాన్ని ఇప్పుడు ఏటిటిలో రిలీజ్ చేయనున్నారు.

తండ్రిపై ఉన్న ప్రేమతో.తండ్రి సినిమా అంటే ఎంతో ఇష్టపడే బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా నర్తనశాల.ఈ సినిమా ఒక అద్భుతం.ఈ సినిమాలో రియల్ స్టార్ శ్రీహరి నటించారు.

అయన సన్నివేశాలు ఎంత సేపు ఉన్నాయ్ అనేది తెలియదు కానీ అయన చనిపోయిన తర్వాత అయన నటించిన సినిమా రిలీజ్ అయ్యి అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.ఇక ఆ సినిమాలో కేవలం అయన మాత్రమే కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ సౌందర్య గారు కూడా నటించారు.

ద్రౌపది పాత్రలో నటించిన ఆమె ఆ సినిమా చేస్తున్న సమయంలోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు.ఇక ఇప్పుడు ఆమె ఉన్న సన్నివేశం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

17 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా విజయదశమి సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఎన్.బి.కె థియేటర్, శ్రేయాస్ యాప్ లో విడుదల చేయనున్నారు.ఈ సినిమా అప్పట్లోనే పూర్తయ్యి విడుదల అయ్యి ఉంటే టికెట్ మహా అంటే 15 రూపాయిలు లేదా 20 అంతకు ఎక్కువ అంటే 25 రూపాయలకు వచ్చేది.

కానీ ఇప్పుడు విడుదల అవుతుంది.అది కూడా కేవలం 17 నిమిషాల సినిమా.ఇప్పుడు థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా యాప్ లో విడుదల చెయ్యడం వల్ల మంచి లాభాలే వస్తాయ్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు.ఇంకా ఈ సినిమాకు ఇప్పటి వరకు టికెట్ ధరను నిర్ణయించలేదు.

కానీ 50 రూపాయిల కంటే ఈ టికెట్ ధర ఎక్కువే ఉంటుందని అంటున్నారు.అయితే ఈ సినిమాలో ఎంతలాభం వచ్చిన కొంతభాగం మాత్రం తల్లి పేరు మీద ఉన్న బసవతారకం ట్రస్ట్ కు ఇవ్వాలని బాలయ్య ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube