నందమూరి మోక్షజ్ఞ సినిమాల ఎంట్రీ పై ఫ్యాన్స్ ఆశలు వదిలేస్తున్నారట!

నందమూరి ఫ్యామిలీ నుండి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని అభిమానులు గత అయిదు ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.ఎన్టీఆర్‌ చాలా చిన్న వయసులోనే హీరోగా పరిచయం అయ్యాడు.

 Balakrishna Son Mokshagna Movies Entry Fans On Fire , Balakrishna, Balakrishna S-TeluguStop.com

బాలకృష్ణ కూడా చాలా చిన్న వయసు లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ లను దక్కించుకున్నారు.వీరిద్దరి దారిలోనే కచ్చితంగా మోక్షజ్ఞ కూడా చిన్న వయసు లోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు.

కాని మోక్షజ్ఞ తన ఎంట్రీని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చాడు.ఎట్టకేలకు ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఆ మద్య ఒక సినిమా ప్రమోషన్‌ సందర్బంగా బాలకృష్ణ స్వయంగా ప్రకటించాడు.

తాను దర్శకత్వం వహించబోతున్న సినిమా లో మోక్షజ్ఞ నటిస్తాడని బాలయ్య చెప్పాడు.కాని అక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా లేడని అనిపిస్తుంది.

హీరో అవ్వాలంటే చిన్న వయసు నుండే చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.మెగా ఫ్యామిలీ ఉన్న హీరోలు రెండు పదుల వయసు రాకుండానే లుక్ పరంగా.

ఫిజిక్ పరంగా కసరత్తులు ప్రారంభిస్తూ ఉంటారు.అలా కసరత్తులు ప్రారంభించడం వల్ల ఖచ్చితంగా హీరో అయ్యే టైమ్‌ కు మంచి ఫిజిక్ తో పాటు లుక్ వస్తుంది.

కాని మోక్షజ్ఞ నాలుగు అయిదు సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్నా కూడా కనీసం లుక్ పరంగా.ఫిజిక్ పరంగా కూడా సినిమా ల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడం లేదు.

సినిమా లు షూటింగ్‌ లో పాల్గొనడం ఆయనకు ఇష్టం ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది. మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వకుంటే బాలయ్య ఫ్యాన్స్‌ ఊరుకునే పరిస్థితి లో కనిపించడం లేదు.2025 వరకు ఖచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వాల్సిందే అన్నట్లుగా వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube