వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ జయంతి రోజున మోక్షజ్ఞ సర్‌ ప్రైజ్‌ ఉంటుందట

నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా ఇటీవల బాలకృష్ణ అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విషయంపై స్పష్టత ఇచ్చాడు.మోక్షజ్ఞ కు అసలు సినిమా ఇంట్రెస్ట్‌ ఉందా బాలయ్య ఆయన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకు వస్తాడా లేదా అనే విషయమై స్పష్టత ఇవ్వలేదు.

 Balakrishna Son Mokshagna Movie Entry-TeluguStop.com

ఇన్నాళ్లకు ఆ విషయమై స్పష్టత వచ్చేసింది.తన తండ్రి జయంతి సందర్బంగా పలు మీడియా సంస్థలతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ గురించి క్లారిటీ ఇచ్చాడు.

తన కొడుకు మోక్షజ్ఞ ను ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌ తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించాడు.ఆ సినిమా లో తాను మోక్షజ్ఞ తండ్రి కొడుకులు గా మాత్రం నటించడం లేదు అంటూ స్పష్టం చేసిన బాలయ్య మరో ఆసక్తికర విషయాన్ని ఇటీవల అభిమానులతో జూమ్‌ మీటింగ్‌ లో తెలియజేశాడు.

 Balakrishna Son Mokshagna Movie Entry-వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ జయంతి రోజున మోక్షజ్ఞ సర్‌ ప్రైజ్‌ ఉంటుందట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ మీటింగ్ లో మోక్షజ్ఞ గురించిన మరో విషయాన్ని చెప్పుకొచ్చాడు.

వచ్చే ఏడాది నాన్న గారి జయంతి సందర్బంగా మోక్షజ్ఞ ఎంట్రీ ప్రకటన చేస్తాను అన్నాడు.

ఎన్టీఆర్‌ వందవ జయంతి కనుక ఖచ్చితంగా ఆ సమయంలో హడావుడి హంగామా చాలా ఉంటుంది.కనుక మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించిన మరింత స్పష్టత అదే రోజు ఇవ్వాలని భావిస్తున్నారట.

ఆ రోజున మోక్షజ్ఞ లుక్‌ ను కూడా అధికారికంగా రివీల్‌ చేయబోతున్నారు.ఇప్పటి వరకు మోక్షజ్ఞ లుక్‌ ను అధికారికంగా విడుదల చేయలేదు.ఎందుకంటే ఆయన కాస్త ఓవర్‌ వెయిట్‌ ఉన్నాడు.ఆ వెయిట్‌ కారణంగానే మోక్షజ్ఞ కనిపించడం లేదు.

Telugu Balakrishna, Balakrishna Son, Film News, Mokshagna, Nandamuri Films-Movie

బాలయ్య సీరియస్ గా వచ్చే ఏడాది తాతగారి జయంతి వరకు స్లిమ్‌ గా అవ్వాలని హెచ్చరించాడు.అదే సమయంలో సినిమా కు సంబంధించిన ప్రకటన చేయబోతున్నట్లుగా బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.ఈ విషయం ప్రస్తుతం అభిమానులకు మస్త్‌ బూస్టింగ్‌ ను ఇస్తుంది.

#Mokshagna #Balakrishna Son #Balakrishna #Nandamuri Films

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు