మళ్లీ అమెరికాకు మోక్షజ్ఞ.. ఈసారి ఆ పని కోసం  

Balakrishna Son Mokshagna Go To America - Telugu Balakrishna Son Mokshagna, Mokshagna, Mokshagna In Over Weight, Mokshagna Latest News, Mokshagna Tollywood Entry, Ram Charan And Mokshagna

నందమూరి బాలకృష్ణ ఒక వైపు హీరోగా నటిస్తూ ఉండగానే ఆయన కొడుకు ఎప్పుడెప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.గత రెండు మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్‌ ఆరాటంగా ఎదురు చూస్తున్నారు.

Balakrishna Son Mokshagna Go To America - Telugu Balakrishna Son Mokshagna, Mokshagna, Mokshagna In Over Weight, Mokshagna Latest News, Mokshagna Tollywood Entry, Ram Charan And Mokshagna-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాని మోక్షజ్ఞకు మాత్రం ఏమీ పట్టనట్లుగా చాలా లావుగానే కనిపిస్తూ ఉన్నాడు.అసలు సినిమాపై ఆసక్తి ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మోక్షజ్ఞ పర్సనాలిటీ చూస్తుంటే అతడు హీరో ఏంటీ అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.కాని బాలయ్య మాత్రం కొడుకును హీరోగా పరిచయం చేసి రామ్‌ చరణ్‌కు పోటీగా నిలపాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకే గతంలో అమెరికాలో కొడుకుకు నటనలో శిక్షణ ఇప్పించిన బాలకృష్ణ ఆమద్య కథలు కూడా విన్నాడు.కాని కొడుకు బరువు కారణంగా సినిమాలను ఆలస్యం చేస్తూ వస్తున్నాడు.

ఇప్పుడు మళ్లీ కొడుకును అమెరికాకు బాలయ్య పంపాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో ప్రముఖ ట్రైనర్‌ వద్ద ప్రస్తుతం మోక్షజ్ఞ వర్కౌట్స్‌ చేస్తున్నాడట.మూడు నెలల్లో 50 నుండి 60 కేజీల బరువుకు మోక్షజ్ఞను ఆ ట్రైనర్‌ తీసుకు వస్తానంటూ అగ్రిమెంట్‌ ఇచ్చాడట.దాంతో వేసవిలో మోక్షజ్ఞ మూవీ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది.

ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదికి అయినా మోక్షజ్ఞ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపుగా ఖాయం.

తాజా వార్తలు

Balakrishna Son Mokshagna Go To America-,mokshagna,mokshagna In Over Weight,mokshagna Latest News,mokshagna Tollywood Entry,ram Charan And Mokshagna Related....