సైడ్ అయిన బాలయ్య చిన్నల్లుడు…ఆ ఇద్దరు కూడా సైలెంట్… !  

Balakrishna Son in Law Sri bharath Silence in Party,tdp,leader,bala krishna son in law sri bharath,vasupalli ganesh,vishaka TDP control - Telugu Leader, Tdp, Vasupalli Ganesh

2019 ఎన్నికల్లో టీడీపీ కాస్తోకూస్తో సత్తా చాటిన జిల్లాల్లో విశాఖపట్నం కూడా ఒకటి.జిల్లా మొత్తంలో ప్రభావం చూపలేకపోయినా సరే నగరంలో అదరగొట్టింది.

TeluguStop.com - Balakrishna Son In Law Sri Bharath Vizag Party

నగర పరిధిలో ఉన్న నాలుగు స్థానాల్లో టీడీపీదే పైచేయి.విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ స్థానాలు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి.

అయితే టీడీపీ బలం ఉండటంతో, నగరంలో వైసీపీ పుంజుకోలేని స్థితికి వెళ్లింది.ఈ సమయంలోనే సీఎం జగన్ విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించడం కలిసొచ్చింది.

TeluguStop.com - సైడ్ అయిన బాలయ్య చిన్నల్లుడు…ఆ ఇద్దరు కూడా సైలెంట్… -Political-Telugu Tollywood Photo Image

చంద్రబాబు అమరావతికి మద్ధతు తెలపడంతో, విశాఖలో టీడీపీకి ప్రతికూల వాతావరణం ఏర్పడింది.అక్కడ టీడీపీ బలం తగ్గుతూ వచ్చింది.అలాగే కొందరు టీడీపీ నేతలు సైలెంట్ అయితే, కొందరు టీడీపీని వీడారు.ఇక ఇటీవల సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ టీడీపీని వీడి, జగన్‌కు జై కొట్టారు.

అటు నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నా లేనట్టే, రేపోమాపో ఆయన వైసీపీ వైపు వెళ్ళడం ఖాయం.

ఇక మొదట్లో దూకుడు కనబర్చిన ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు ముందు నుంచి సైలెంట్‌గానే ఉన్నారు.ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ స్థానంలో తక్కువ మెజారిటీతో ఓడిపోయిన బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఇప్పుడు పార్టీలో కనిపించడం లేదు.

విశాఖ నగరంలో పూర్తిగా వైసీపీ డామినేషన్ ఉండటంతో భరత్ సైలెంట్ అయిపోయారు.

దీంతో విశాఖ నగరంపై టీడీపీ పూర్తిగా పట్టు కోల్పోయిందని తెలుస్తోంది.

పైగా తాజాగా వి‌డి‌పి అసోసియేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో విశాఖలో వైసీపీ హవా నడుస్తుందని తెలిసింది.జి‌వి‌ఎం‌సి ఎన్నికలు జరిగితే వైసీపీదే పైచేయి అని తేలింది.జి‌వి‌ఎం‌సి పరిధిలో ఉన్న 98 సీట్లలో వైసీపీకి 84-89 వరకు వస్తాయని.టీడీపీకి 8-14 మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని వి‌డి‌పి సర్వే తెలిపింది.

అంటే విశాఖలో టీడీపీ పని క్లోజ్ అయిందని తెలుస్తోంది.

#Leader

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Son In Law Sri Bharath Vizag Party Related Telugu News,Photos/Pics,Images..