టీడీపీ కి జూనియర్ ఎన్టీఆర్ అవసరమే లేదంటున్న బాలయ్య అల్లుడు

టీడీపీ పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదంటూ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడం తో ఆ సమయంలో పలువురు టీడీపీ పార్టీ పని అయిపొయింది అని,ఆ పార్టీ ఉండాలి అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చి ఆ పార్టీ ని నడిపించాలి అంటూ కామెంట్లు పెట్టిన విషయం తెలిసిందే.

 Balakrishna Son In Law Bharat Controversial Comments On Junior Ntr-TeluguStop.com

అయితే ఆ తరువాత దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు.అయితే ఇప్పుడు తాజాగా ఈ అంశం పై బాలయ్య చిన్నల్లుడు సంచలన కామెంట్స్ చేశారు.

ఒక ప్రయివేట్ ఛానెల్ లో మాట్లాడిన బాలయ్య చిన్నల్లుడు భరత్ టీడీపీ కి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర పరాజయం ఎదుర్కొంది.

తెలంగాణ లో ఒంటరిగా పోటీకి దిగలేని పరిస్థితి లో ఉన్న టీడీపీ పార్టీ, ఏపీ లో కూడా కేవలం 23 స్థానాలకే పరిమితమవ్వడం తో ఇక పార్టీ భూస్థాపితం మయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని,అందుకే టీడీపీ మనుగడ కొనసాగాలి అంటే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలి అంటూ పలువురు టీడీపీ పార్టీ అభిమానులు కోరారు.

Telugu Balakrishna Son, Chandrababu, Ntr, Tdp-Telugu Political News

అయితే బాలయ్య చిన్నల్లుడు భరత్ మాత్రం టీడీపీ పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని అంటూ సంచలన కామెంట్స్ చేసిన ఆయన ఇప్పటివరకు నడిపిన నాయకులూ సమర్థులు కారన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube