బాలయ్య చుట్ట తాగుతాడట!

నందమూరి హీరో బాలకృష్ణ తాజాగా ‘డిక్టేటర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్‌ అయ్యింది.

 Balakrishna Smoking Habit-TeluguStop.com

అయినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ మీట్‌, సక్సెస్‌ టూర్‌లు నిర్వహిస్తున్నారు.తాజాగా బాలయ్య కూడా ఈ సినిమా సక్సెస్‌ సందర్బంగా అంటూ మీడియాతో మాట్లాడాడు.

ఈ సమయంలోనే బాలయ్య కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.తాను తన తండ్రి ఎన్టీఆర్‌ను ప్రతి విషయంలో ఫాలో అవుతాను అని, అలాగే చుట్ట తాగే విషయంలో కూడా తన తండ్రే తనకు ఇన్సిపిరేషన్‌ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.

స్వర్గీయ ఎన్టీఆర్‌ కఠం బాగుండేందుకు ప్రతి రోజు రెండు మూడు చుట్టలు తాగే వారు అని, అందుకే ఆయన గొంతు కంచు మ్రోగిన విధంగా ఉండేది అని బాలయ్య చెప్పుకొచ్చాడు.అలాగే తాను కూడా ప్రతి రోజు రెండు మూడు చుట్టలు తాగుతాను అని, అందుకే తన డైలాగ్‌ డెలవరీ బాగుంటుందని బాలయ్య చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత కాలంలో చుట్టలు తాగడం చాలా తక్కువ.సిగరెట్ల కాలంలో చుట్టలు అంటే ఆశ్చర్య పోతారు.

కాని బాలయ్య మాత్రం ఏమాత్రం మొహమాటం లేకుండా తాను చుట్ట తాగుతాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపర్చుతున్నాడు.బాలయ్యకు మందు అవాటు కూడా బాగా ఉందని టాలీవుడ్‌లో టాక్‌.

ఆ విషయంపై ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube