మరొకసారి తండ్రి పాటతో రాబోతున్న నటసింహం !

నటసింహం నందమూరి బాలకృష్ణ మరొకసారి తన తండ్రి ఎన్టీఆర్ పాటతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది.ఆయన గత సంవత్సరం పాడిన శివ శంకరి, ఈ సంవత్సరం పాడిన శ్రీరామ దండకం పాటలను బాలకృష్ణ విడుదల చేయడంతో ఆ పాటలకు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది.

 Balakrishna Sing Another Ntr Song-TeluguStop.com

అందుకే ఇప్పుడు మరొకసారి తన పాటను విడుదల చేయడానికి సిద్ధం అయినట్టు తెలుస్తుంది.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Sing Another Ntr Song, Boyapati Srinu, Ntr Song-Movie

మరొకసారి కూడా ఎన్టీఆర్ పాటను పాడి విడుదల చేసేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే ఈ పాట ఎప్పుడు విడుదల చేయబోతున్నాడనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు.మరొకసారి కూడా కఠిన మైన పాటతోనే రాబోతున్నాడేమో.

 Balakrishna Sing Another Ntr Song-మరొకసారి తండ్రి పాటతో రాబోతున్న నటసింహం -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది ఎలా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇలా తనలోని సింగింగ్ ప్రతిభను మరొకసారి నిరూపించుకునే పనిలో బాలయ్య ఉన్నట్టు తెలుస్తుంది.

మరి చూడాలి ఈసారి ఎలాంటి పాటతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న అఖండ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.

ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Sing Another Ntr Song, Boyapati Srinu, Ntr Song-Movie

ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆట్టుకున్నాయి.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమా పాటల విషయంలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

#NTR Song #Balakrishna #Boyapati Srinu #BalakrishnaSing #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు