నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ తో ఆహా ఓటీటీ లో కుమ్మేస్తున్నాడు.ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ అయ్యాయి.
మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు.రెండవ ఎపిసోడ్ లో నాని, మూడవ ఎపిసోడ్ లో బ్రహ్మానందం, నాల్గవ ఎపిసోడ్ లో అఖండ టీమ్ అయిదవ ఎపిసోడ్ లో రాజమౌళి గెస్ట్ లుగా హాజరు అయ్యారు .ఈ అయిదు ఎపిసోడ్ ల్లో కూడా ఒకే కామన్ విషయం కనిపిస్తూ వస్తుంది.వచ్చిన గెస్ట్ లు లేదా తనకు తానే బాలయ్య కుటుంబం గురించి తండ్రి ఎన్టీఆర్ గురించి తన సినిమాల గురించి తన బసవ తారకం ఆసుపత్రి గురించి ఎక్కువ సమయం మాట్లాడుతున్నారు.
షో దాదాపుగా 50 నుండి 60 నిమిషాలు ఉంటే అందులో కనీసం 10 నుండి 15 నిమిషాల వరకు బాలయ్య లేదా ఎన్టీఆర్ ల డబ్బా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి.తాజాగా స్ట్రీమింగ్ అయిన రాజమౌళి ఎపిసోడ్ లో అయితే మరీ దారుణంగా 20 నిమిషాలను మించినట్లుగా అనిపించింది.
ఇది ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఎన్టీఆర్ గొప్ప నటుడు కాదనడం లో సందేహం లేదు.కాని ఇప్పుడు కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం ఎందుకు అంటూ కొందరు బాలయ్య ను ప్రశ్నిస్తున్నారు.మా నాన్న గారు అంటూ బాలయ్య ప్రతి ఎపిసోడ్ లో ఇస్తున్న స్పీచ్ తగ్గించుకుంటే షో మరింత పాపులర్ అవ్వడంతో పాటు ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

అన్ స్టాపబుల్ లో బాలయ్య గెస్ట్ లను అడుగుతున్న ప్రశ్నలు మరియు అన్ని విధాలుగా ఆయన చేస్తున్న సరదా సంభాషణలు షో స్థాయిని పెంచేస్తున్నాయి అంటున్నారు.ఇక ఆరవ ఎపిసోడ్ గెస్ట్ రవితేజ అనే వార్తలు వస్తున్నాయి.గోపీచంద్ మలినేని తో కలిసి రవితేజ రాబోతున్నాడు.ఇక మహేష్ బాబు ఎపిసోడ్ ఇప్పటికే షూట్ అయ్యింది.కనుక ఏ సమయంలో అయినా ఆ షో టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.