స్టార్ట్ అవ్వగానే ఇంటర్వెల్.. బాలయ్య మజాకా!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభించారు చిత్ర యూనిట్.

 Balakrishna Shoot Interval Bang On First Day-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు బాలయ్య-బోయపాటిలు రెడీ అవుతున్నారు.

అయితే మంగళవారం ఈ సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభించాు చిత్ర యూనిట్.

ఈ సీక్వెన్స్‌ ఓ అదిరిపోయే ట్విస్టు రానుండటంతో ఈ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయే రేంజ్‌లో రానున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో నటిస్తుండగా, రెండో పాత్రకు సంబంధించిన ఎలివేషన్ ఇక్కడే వస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ మొత్తం యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వస్తుందని తెలుస్తోంది.

అంటే బాలయ్య షూటంగ్‌ను మొదలుపెట్టిందే ఇంటర్వెల్ బ్యాంగ్‌తో జరగడం నిజంగా విశేషమని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో బాలయ్య అఘోరా, ఫ్యాక్షనిస్టు పాత్రల్లో నటిస్తుండగా అంజలి, శ్రియా సరన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube