ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య షాకింగ్ కామెంట్స్..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కోరుకుంటున్న సంగతి తెలిసిందే.వరుస విజయాలతో జోరుమీదున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఏపీలో బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

 Balakrishna Shocking Comments About Ntr Political Entry-TeluguStop.com

అయితే తాజాగా బాలకృష్ణ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి.

నిన్న బాలకృష్ణ పుట్టినరోజు కాగా ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

 Balakrishna Shocking Comments About Ntr Political Entry-ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య షాకింగ్ కామెంట్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో యాంకర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి ప్లస్ అవుతుందా అని ప్రశ్నించగా మైనస్ అయితే ఏం చేస్తారంటూ బాలయ్య రివర్స్ లో ప్రశ్నించారు.ప్లస్ ప్లస్ అయితే ప్లస్ అవుతుందని ప్లస్ మైనస్ అయితే మాత్రం మైనస్ అవుతుందని బాలయ్య పేర్కొన్నారు.

హీరోగా ఎన్టీఆర్ సక్సెస్ సాధించినంత మాత్రాన అందరూ ఆ విధంగా సక్సెస్ సాధిస్తారని అనుకోవడానికి లేదని బాలయ్య చెప్పుకొచ్చారు.ఆవేశం నుంచి టీడీపీ పుట్టిందని అలాంటి వాళ్లకు మాత్రమే పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలయ్య చెప్పుకొచ్చారు.కొన్ని రోజుల క్రితం జరిగిన మహానాడు కార్యక్రమంలో మనం యువతను పట్టించుకోవడం లేదని తాను చెప్పానని యువతను పట్టించుకునే బాధ్యత తనకు ఇస్తే తాను చూసుకుంటానని బాలయ్య పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదనే విధంగా బాలయ్య కామెంట్స్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ను తీసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని వినిపించగా బాలయ్యకు కూడా ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యలతో కన్ఫామ్ అయింది.2019 ఎన్నికల ఫలితాలు 2024లో పునరావృతం అయితే మాత్రం టీడీపీ ఏపీలో మరింత బలహీనపడే అవకాశాలు ఉంటాయి.

#Young Tiger NTR #Tdp Minus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు