బంద్ పై బాలయ్య సీరియస్.. నిర్మాతలు ఆందోళన.. అసలేం జరుగుతుంది?

ప్రెసెంట్ మన టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఆందోళనగా ఉంది.ఈ పరిస్థితులు చక్కబడే వరకు కొద్దీ రోజులు షూటింగులు వాయిదా వేయాలని స్వచ్చంధంగా నిర్ణయం తీసుకున్నారు.

 Balakrishna Serious Warning To Producers Bundh Issue , Nbk107 , Nandamuri Balakrishna , Gopichand Malineni, Tollywood, Producers, Bundh Issue-TeluguStop.com

అయితే ఈ నిర్ణయం విమర్శలకు దారి తీస్తుంది.ఆగష్టు 1 నుండి షూటింగులు నిలిపి వేయడంతో కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

టాలీవుడ్ లో ఇద్దరు ప్రొడ్యూసర్స్ మాత్రం షూటింగ్ వాయిదా వేయకుండా తమిళ్ సినిమాలంటూ చెప్పుకుంటూ షూటింగులు చేసుకుంటున్నారు.

ఈ డబుల్ స్టాండ్ పై అందరి మండి పడుతున్నారు.

గిల్ట్ నిర్మాతల మండలి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కటే అయినా కూడా ఇలా డబుల్ స్టాండ్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే ఈ విషయంపై ఇద్దరుముగ్గురు బాహాటంగానే తమ విమర్శలు తెలుపగా.

ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ బంద్ పై సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

నందమూరి సీనియర్ హీరో బాలయ్యబంద్ విషయంలో నిర్మాతలకు సీరియస్ వార్ణింగ్ ఇచ్చారట.

ఈ స్ట్రైక్ కారణంగా ఈయన షెడ్యూల్ తారుమారు అవుతుంది.అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఆగష్టు 9 లోగ బంద్ విషయంలో ఏదో ఒకటి తేల్చాలంటూ నిర్మాతలకు ఈయన సీరియస్ అల్టిమేటం జారీ చేసారని టాక్.

ఈయన వార్ణింగ్ కు ఎదురు చెప్పే ధైర్యం ఏ నిర్మాతకు లేదు.అందుకే ఏం చేయాలో.

ఎలా చెప్పాలో తెలియక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది.

మరి చివరకు ఈ బంద్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.ప్రెజెంట్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

కర్నూల్ లో షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా బంద్ కారణంగా వాయిదా పడింది.ఇది పూర్తి కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడు.

అలాగే ఈ మధ్యలోనే అన్ స్టాపబుల్ 2 కూడా స్టార్ట్ కాబోతుంది.మరి ఈ రెండు షెడ్యూల్స్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే మైత్రి దిగి రావాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube