బోయపాటి మీద పిచ్చ కోపంగా బాలయ్య

సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన ‘సింహా’ సినిమా బాలకృష్ణ కెరీర్ లో మరచిపోలేని ఒక మైలు రాయిగా మిగిలిపోయింది.బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కి ముందర దాదాపు పదేళ్ళ పాటు బాలయ్య వరస ప్లాపులతో సతమతం అయ్యేవారు.

 Balakrishna Serious On Boyapati-TeluguStop.com

ఈ సినిమా సమయంలో కూడా సింహా మీద మినిమం అంచనాలు లేవు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.ఆ సినిమా తరవాత మూడేళ్లకి లెజెండ్ అంటూ వచ్చిన బాలకృష్ణ మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడమే కాక తన కెరీర్ లో బెస్ట్ రెవెన్యూ చూసిన సినిమాగా లెజెండ్ ని చేర్చుకున్నారు.

అలాంటి డైరెక్టర్ బోయపాటి తో బాలకృష్ణ 100 వ సినిమా చెయ్యాలి అని ఏ ప్రేక్షకుడైనా కోరుకుంటాడు, నందమూరి అభిమానులు యితే మరీ ముఖ్యంగా కోరుకుంటారు.అది నిజం అవుతుంది అనీ బాలయ్య తన 100 వ సినిమా తో అన్ని రికార్డులూ బద్దలు కొడతాడు అనీ లెక్కలు వేసారు ఫాన్స్ కానీ సీన్ కట్ చేస్తే బాలయ్య బోయపాటి ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతున్నారు.

బాలయ్య సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ అంటున్నాడు.బోయపాటి ఏమో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఓ సినిమాకు తయారవుతున్నాడు.

ఐతే తమ కాంబినేషన్లో ప్రతిష్టాత్మకమైన సినిమా వదిలేసి.వీళ్లిద్దరూ వేరే సినిమాల వైపు చూస్తుండటమేంటో ఎవ్వరికీ అంతు పట్టట్లేదు.

మ్యాటర్ ఏంటంటే ఎప్పుడో ఇచ్చిన కమిట్మెంట్ విషయంలో బాలకృష్ణ తో కాకుండా బెల్లం కొండ సురెహ్ కొడుకు బలం కొండ సాయి శ్రీనివాస్ తో అగ్రిమెంట్ అయిపోవడం తో ఆ సినిమా చేసి గానీ ఈ సినిమా చెయ్యలేని పరిస్థితి బోయపాటి ది.ఆ సినిమా గత ఏడాదే మొదలవ్వాల్సింది.కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.ఇప్పుడు తన కొడుకుతో సినిమా చేసి తీరాల్సిందే అంటూ పట్టుబట్టాడు బోయపాటి.ఇప్పటికే అగ్రిమెంట్ అయిపోవడం, ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి అవ్వడం తో బోయపాటి ఆ ప్రాజెక్ట్ లో ఇరుక్కుపోయాడు.సరైనోడు తరవాత ఆ సినిమానే మొదలు పెట్టాల్సి ఉంది.

అసలే బాలకృష్ణ కీ బెల్లంకొండ వారికీ పడదు.ఈ తరుణం లో తనని కాదని బెల్లంకొండ వారికి సినిమా చేస్తున్నందుకు బాలయ్య యమా సీరియస్ గా ఉన్నారట .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube