'అరవింద సమేత' చూసి బాలయ్య ఏమన్నారో తెలుసా.? అలా కామెంట్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు.!     2018-10-15   10:25:11  IST  Sai Mallula

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా చూసేందుకు అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌ కలిసి వర్క్‌ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేశాడు. ఇటీవల మాస్‌ ఫార్ములాను పక్కన పెట్టి వరుస విజయాలు సాధిస్తున్న తారక్‌, ఫైనల్‌గా తాను అనుకున్నట్టుగా త్రివిక్రమ్‌తో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌ తరువాత కూడా మాటల మాంత్రికుడిని నమ్మి అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలై ప్రశంసలు అందుకుంది.

Balakrishna Sensational Comments On Jr NTR About Aravinda Sametha-

Balakrishna Sensational Comments On Jr NTR About Aravinda Sametha

ప్రస్తుతం అరవింద సమేత రికార్డుల జోరును కొనసాగిస్తుంది.నైజం ఫస్ట్ డే షేర్ లో అరవింద సమేత మూడోవ ప్లేస్ లో ఉంది.బాహుబలి -1 ,2 తర్వాత 5 .65 కోట్లతో ఎన్టీఆర్ మూడోవ ప్లేస్ లో ఉన్నారు. ఈ సినిమాపై సక్సెస్ పై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు.

Balakrishna Sensational Comments On Jr NTR About Aravinda Sametha-

దమూరి నటసింహం బాలకృష్ణ సైతం అరవింద సమేత పై జూనియర్ ఎన్టీఆర్ నటనపై తన స్టైల్ లో స్పందించారు .నా కుమారుడు తన సత్తా ఏమిటో అరవింద సమేత సినిమాలో మరో సరి రుజువు చేసాడు.ఇటీవలే రోడ్డు ప్రమాదం లో చనిపోయిన నా అన్న నందమూరు హరికృష్ణ ఏ లోకంలో ఉన్న అయన ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబంపై ఉంటాయి.అందుకే అరవింద సమేత సినిమా విజయాన్ని హరికృష్ణ గారికి అంకితం చేసిన తారక్ కు నిజంగా అబినందనలు తెలుపుతున్నాను అంటూ బాబాయ్ బాలకృష్ణ ,అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ కు అబినందనలు తెలపడం నిజంగా విశేషం అనే చెప్పుకోవచ్చు.