రూలర్ ట్రైలర్‌తో బీభత్సం సృష్టించిన బాలయ్య  

Balakrishna Ruler Trailer Released-ks Ravikumar,ruler,ruler Trailer,sonal Chauhan

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రూలర్ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో బాలయ్య గెటప్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

Balakrishna Ruler Trailer Released-ks Ravikumar,ruler,ruler Trailer,sonal Chauhan Telugu Tollywood Movie Cinema Film Latest News Balakrishna Ruler Trailer Released-ks Ravikumar Ruler Sonal Chauhan-Balakrishna Ruler Trailer Released-Ks Ravikumar Ruler Sonal Chauhan

గత సినిమాల కంటే బాలయ్య ఈ సినిమాలో చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.కాగా రూలర్ సినిమా ట్రైలర్ చూస్తే మరోసారి బాలయ్య బీభత్సం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన రూలర్ ట్రైలర్‌లో సినిమా కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు చిత్ర యూనిట్.రైతులను ఇబ్బందిపెడుతున్న వారి భరతం పట్టే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటన సూపర్.

అటు బాలయ్య చెప్పిన డైలాగులకు గూస్‌బంప్స్ రావడం ఖాయం.ముఖ్యంగా ‘పార్శల్ చేయడానికి ఇది దెబ్బతిన్న సింహంరా.అంత తొందరగా చావదు.వెంటాడి వేటాడి చంపుద్ది’ అనే డైలాగ్‌కు బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఇక మరో స్టైలిష్ గెటప్‌లో కనిపించిన బాలయ్యకు సంబంధించి ఎక్కవగా ట్రైలర్‌లో చూపించలేదు.సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది.

దర్శకుడు కెఎస్ రవికుమార్ ఈసారి కూడా కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్టుతో వస్తున్నట్లు ట్రైలర్‌లో స్పష్టంగా తెలుస్తోంది.సి.కళ్యాణ్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు