బాలయ్య కొత్త లుక్‌కు కారణం అతడేనట!

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య సందడి చేయడం ఖాయమని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

 Balakrishna Ruler Movie New Look Is Inspired By A Fan-TeluguStop.com

అయితే అలాంటి ఓ అభిమాని వల్లే నేడు బాలయ్య రూలర్ చిత్రంలో తన కొత్త లుక్ సాధ్యమయ్యిందని అంటున్నాడు బాలయ్య.

కొంతకాలం కిందట తన అభిమాన నటుడిని ఐరన్ మ్యాన్ హీరో టోనీ స్టార్క్ గెటప్‌లో చూడాలని ఉందని సదరు అభిమాని బాలయ్యకు గతంలో ఓ ఫోటో పంపాడు.

ఇది చూడటానికి బాగుందని బాలయ్య అనుకుని వదిలేశాడు.అయితే చాలాకాలం తరువాత కెఎస్ రవికుమార్ రూలర్ కథను బాలయ్యకు వినిపించినప్పుడు సినిమాలో ఓ కొత్త గెటప్‌లో బాలయ్య కనిపించాలని చెప్పాడట.

దీంతో బాలయ్య సదరు అభిమాని పంపిన టోనీ స్టార్క్ గెటప్‌ను సజెస్ట్ చేశాడట.

దర్శకుడు కూడా ఓకే చెప్పేయడంతో బాలయ్య రూలర్ చిత్రంలోని కొత్త గెటప్ పుట్టుకొచ్చింది.

దీనికి సంబంధించిన విషయాలను బాలయ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.అభిమాని చెప్పిన సలహాను పాటించిన హీరోగా బాలయ్య తన అభిమానుల్లో మరింత క్రేజ్‌ను సంపాధించుకున్నాడు.

ఇక ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube