రూలర్ ఇన్‌సైడ్ టాక్.. బాలయ్య ఏందయ్యా?

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు విభిన్న పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 Balakrishna Ruler Movie Inside Talk Out-TeluguStop.com

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇన్‌సైడ్ టాక్ తాజాగా బయటకు వచ్చింది.

రూలర్ సినిమాను చూసిన చిత్ర వర్గాలు ఈ సినిమాతో బాలయ్య మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వడ్డించనున్నాడని తెలిపారు.

కానీ ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదని, రొటీన్ కథతో దర్శకుడు బాలయ్యను మరోసారి ప్రేక్షకుల ముందుకు వదిలాడని అన్నారు.ధర్మ పాత్రలో బాలయ్య చేసే పోరాటం కాస్త బాగున్నా, సెకండాఫ్‌లో భూమిక ఇచ్చే ట్విస్టు అంత ఆసక్తికరంగా లేదని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలోని పాటలను పెద్దగా పట్టించుకునే అవసరం కూడా లేదని తెలుస్తోంది.ఒక్క పాట కూడా వినసోంపుగా లేదని సినిమా చూసిన వారు అన్నారు.

బాలయ్య కెరీర్‌లో 105వ సినిమాగా వస్తున్న రూలర్ సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పించడంలో కొంత మేర సక్సెస్ అవుతుందని, కానీ ఏ క్లాస్ ఆడియెన్స్‌కు సినిమా పెద్దగా నచ్చకపోవచ్చనేదని ఇన్‌సైడ్ టాక్.మరి ఈ టాక్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే రూలర్ సినిమాను థియేటర్‌లో చూసే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube