చరణ్‌ 100 మందితో ఫైట్‌ చేస్తే బాలయ్య 500 మందితో చేయబోతున్నాడట

నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం రూలర్‌ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంలో బాలయ్య చాలా ట్రెండీ లుక్‌తో అందరిని ఆకట్టుకుంటున్నాడు.

 Balakrishna Rular Movie Latest Update-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.ఈ సినిమాలోని ఒక ఫైట్‌ గురించి ప్రస్తుతం తెగ చర్చ జరుగుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంకు ఆ ఫైట్‌ సీన్‌ చాలా హైలైట్‌ అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Telugu Balakrishna, Balakrishnaks, Ramcharan-

ప్రస్తుతం ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట.దాదాపుగా 500 మందితో బాలయ్య పోరాడే సన్నివేశాన్ని ప్రముఖ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌లు కంపోజ్‌ చేస్తున్నారట.అంత మందితో ఫైటింగ్‌ అంటే మామూలు విషయం కాదు.

అయిన కూడా దర్శకుడు మరియు ఫైట్‌ మాస్టర్స్‌ ఓవర్‌ అవ్వకుండా కాస్త జాగ్రత్తగా ఆ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారట.చాలా నాచురల్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో యాక్షన్‌ సన్నివేశల డోస్‌ తగ్గించినట్లుగా చెబుతున్నారు.

Telugu Balakrishna, Balakrishnaks, Ramcharan-

మగధీర చిత్రంలో చరణ్‌ 100 మందితో పోరాడితే రూలర్‌ సినిమాలో ఏకంగా 500 మందితో పోరాటం చేయబోతున్నాడు.అందుకే ఈ సీన్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, దాంతో పాటు అద్బుతమైన విజువల్‌ ట్రీట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఎన్టీఆర్‌ చిత్రం తర్వాత బాలయ్యకు తీవ్ర నిరాశ మిగిలింది.

అందుకే ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube