బాలయ్య కోసం నాని హీరోయిన్.. ఒప్పుకుంటుందా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథను ఎంచుకున్నాడు గోపీచంద్.

 Balakrishna Romance With Mehreen Kaur-TeluguStop.com

క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని మరోసారి అదే వేటపాలెం బ్యాక్ డ్రాప్ తో బాలయ్య సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ను తీసుకుంటారని టాక్.

సీనియర్ హీరోలతో నటించడానికి యువ హీరోయిన్స్ నటించడానికి ఆసక్తి చూపించరు కాని మెహ్రీన్ మాత్రం ఏకంగా బాలయ్య బాబుతో రొమాన్స్ కు సై అంటుంది.అయితే గోపీచంద్, బాలకృష్ణ సినిమాకు హీరోయిన్ గా మెహ్రీన్ ను అడిగారు కాని ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని అంటున్నారు.

 Balakrishna Romance With Mehreen Kaur-బాలయ్య కోసం నాని హీరోయిన్.. ఒప్పుకుంటుందా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి బాలకృష్ణతో మెహ్రీన్ కౌర్ రొమాన్స్ కు సై అంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరుపుకున్న మెహ్రీన్ కౌర్ సినిమాలకు కూడా ఓకే చెబుతుంది.

పెళ్లికి ఇంకా టైం ఉందని ఆమె సైన్ చేసిన సినిమాలన్ని కంప్లీట్ చేయాలని చూస్తుంది.బాలకృష్ణ సినిమా ఓకే చేస్తే మాత్రం మెహ్రీన్ కౌర్ మళ్లీఎ కెరియర్ లో ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

#Romance #Gopichand #Balakrishna #Mehreen Kaur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు