బాలయ్య పాత్రతో ఫ్యాన్స్‌కు పూనకాలే!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతోండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు.

 Balakrishna Role In Monarch To Be Outstanding, Balakrishna, Bb3, Boyapati, Monar-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల బాలయ్య పుట్టినరోజున రిలీజ్ చేయగా, దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ గతకొంత కాలంగా చెబుతూ వస్తోంది.అయితే ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ పవర్‌ఫుల్ టైటిల్‌ను బట్టి ఈ సినిమా ఎలాంటి పవర్‌ఫుల్ కథతో రాబోతుందా అనే క్లూని చిత్ర యూనిట్ ఇచ్చేసింది.కాగా ఇంతటి పవర్‌ఫుల్ టైటిల్ ఉన్న ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

అయితే ఈ సినిమాలో బాలయ్య పాత్ర ప్రేక్షకులు ఊహించినదానికంటే ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉండనుందట.ఈ సినిమాలో బాలయ్యను ఎలివేట్ చేసే విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, బాలయ్య కెరీర్‌లోనే ఇలాంటి పాత్ర చేసి ఉండరని వారు గర్వంగా చెప్పుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక మరో విషయమేమిటంటే, ఈ సినిమాలో బాలయ్య చేయబోయే అఘోరా పాత్ర కూడా చాలా సాలిడ్‌గా ఉండనుందని, ఈ పాత్రతో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.మరి బాలయ్యకు ఈ సినిమాలోని పాత్రలు ఎంతమేర ఆదరణ తీసుకొస్తాయో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube