గాడిద అంటూ రిపోర్టర్ పై చిందులు వేసిన బాలయ్య.. ఏం జరిగిందంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన మాట కొద్దిగా కటుకగా అనిపించిన అతని మనసు మాత్రం చాలా మంచిదని ఎన్నో సందర్భాలలో నిరూపించబడింది.

 Balakrishna Rised On Repoter Do You Know What Happen Balakrishna, Tollywood, Repoter, Scoled, Tollywood-TeluguStop.com

సాధారణంగా బాలకృష్ణకు ఎంతో కోపం అనే విషయం మనకు తెలిసిందే ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు అభిమానులు అతనితో సెల్ఫీల కోసం ఎగబడిన వారిపై బాలయ్య చేయి చేసుకోవడం మనకు తెలిసిందే.అదేవిధంగా మరికొన్ని సందర్భాలలో బాలకృష్ణ మీడియాపై కూడా ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా బాలకృష్ణ రిపోర్టర్లను గాడిద అంటూ వారి పై చిందులు వేసిన ఘటన చోటుచేసుకుంది.నేడు సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

 Balakrishna Rised On Repoter Do You Know What Happen Balakrishna, Tollywood, Repoter, Scoled, Tollywood-గాడిద అంటూ రిపోర్టర్ పై చిందులు వేసిన బాలయ్య.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించాలని బాలకృష్ణ చెబుతున్న సమయంలోనే ఒక రిపోర్టర్ కలగజేసుకుని సార్ వ్యక్తిగతంగా కాదు సామాజిక దూరం అంటూ సమాధానం చెప్పారు.

ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ సామాజిక కాదు గాడిద వ్యక్తిగతం అంటూ సదరు రిపోర్టర్ పై చిందులు తొక్కారు.

అసలు సామాజిక అంటే ఏమిటి అంటూ రిపోర్టర్ పై పంచ్ వేశాడు.ఇలా బాలకృష్ణ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందించారు.

బాలయ్య మూడ్ చాలా బాగున్నట్టుంది అందుకే ఎంతో సున్నితంగా సమాధానం చెప్పారు.లేకపోతే సదరు రిపోర్టర్ కి దబిడి దిబిడే అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube