తేడా ఎక్కడిది.. టికెట్ రేట్ల వివాదంపై బాలయ్య షాకింగ్ కామెంట్స్?

గత కొద్దీరోజులుగా ఏపీ లో టికెట్ రేట్ల విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గిస్తూ జీవోను జారీ చేయగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు.

 Balakrishna Requests Two Telugu State Governments To Support The Industry-TeluguStop.com

ఇదే విషయంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలుగజేసుకొని తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు.

ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఇక కేంద్ర సంక్రాంతి సంబరాలు పేరుతో ఒక సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ మాట్లాడుతూ మొదట అఖండ సినిమా సక్సెస్ గురించి తెలిపారు.

అఖండ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా ప్రస్తుతం ఏపీ లో నడుస్తున్న టికెట్ వ్యవహారం గురించి స్పందించారు.

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పై సినీ ఇండస్ట్రీ వారు అందరూ కలిసి కట్టుగా ఉండి  పోరాడాలని పిలుపునిచ్చారు.బాలయ్యబాబు.

ఈ విషయంపై రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు సినిమా రంగానికి సహకరించాలని కోరారు బాలకృష్ణ.

Telugu Ap, Ap Ticket Rates, Balakrishna, Tollywood, Ys Jagan-Movie

ఇకపోతే సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాను అందుకు కట్టుబడి ఉంటాను అని చెప్పిన బాలకృష్ణ.ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు అని తెలిపారు.పెద్ద సినిమా ప్లాప్ అయితే చిన్న సినిమా అవుతుంది, చిన్న సినిమా హిట్ అయితే పెద్ద సినిమా అవుతుంది అని బాలకృష్ణ తెలిపారు.

అయితే టికెట్ రేట్ల వ్యవహారంగురించి అందరూ కలసి చర్చించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తామని బాలకృష్ణ తెలిపారు.ఈ విషయంలో ఒక్కరి అభిప్రాయం సరికాదని, అందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దామని అన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube