ఆ హీరోయిన్‌ను బాలయ్య బతిమాలాడా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడనే విషయం తెలిసిందే.

 Balakrishna Requested Shriya For His Movie-TeluguStop.com

అఘోరా పాత్రలో అదిరిపోయే పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు మరో పాత్రలో బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో బాలయ్య చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.

బాలయ్యతో సినిమా చేసేందుకు ఏ హీరోయిన్‌ కూడా ముందుకు రాలేదు.దీంతో ఇండస్ట్రీలోని దాదాపు అందరు స్టార్ బ్యూటీలను చిత్ర యూనిట్ సంప్రదించింది.

చివరకు తెలుగు బ్యూటీ అంజలి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది.ఇక మరో హీరోయిన్ పాత్రలో నటించేందుకు బోయపాటి అందాల భామ కేథరిన్ త్రేసాను ఒప్పించాడట.

కానీ బాలయ్య మాత్రం మరో స్టార్ బ్యూటీ శ్రీయాను ఈ సినిమాలో నటించాల్సిందిగా రిక్వెస్ట్ చేశాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాగా ఆడటం, బాలయ్యనే స్వయగంగా శ్రియాను కోరడంతో ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి బాలయ్యకు హీరోయిన్ కష్టాలు ఓ రేంజ్‌లో ఉండటంతో ఇలా బతిమాలి మరి వారిని సినిమాల్లో నటంచేలా చేసుకుంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube