వామ్మో.. అన్ స్టాపబుల్ సీజన్ 2కు బాలయ్య పారితోషికం అన్ని కోట్లా?

నందమూరి అందగాడు బాలకృష్ణ ఏ షో హోస్ట్ చేసినా ఏ సినిమాలో నటించినా తన మార్కు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే.ఆహా ఓటీటీలో గతేడాది ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్1 కు బాలయ్య కేవలం కోటి రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు.

 Balakrishna Remuneration For Unstoppable Season2 Details Here Goes Viral , Balakrishna , Aha Ott, Chiranjeevi, Nagarjuna, Venkatesh,allu Arvind,unstoppable Season 1,remuneration , Shocking Facts , Unstoppble Season2 , Show Host,balakrishna Remuneration-TeluguStop.com

అయితే అన్ స్టాపబుల్ సీజన్2 కు బాలయ్య రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని సమాచారం అందుతోంది.ఈ షోకు ఎపిసోడ్ కు 25 లక్షల రూపాయల చొప్పున బాలయ్య పారితోషికం తీసుకుంటున్నారని బోగట్టా.

మొత్తం 12 ఎపిసోడ్లకు బాలయ్యకు 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.బాలయ్య రేంజ్ కు ఈ రెమ్యునరేషన్ తక్కువే అయినా ఆహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తక్కువ కావడంతో బాలయ్య తక్కువ రెమ్యునరేషన్ కు అంగీకరించారని సమాచారం.

 Balakrishna Remuneration For Unstoppable Season2 Details Here Goes Viral , Balakrishna , Aha OTT, Chiranjeevi, Nagarjuna, Venkatesh,Allu Arvind,Unstoppable Season 1,Remuneration , Shocking Facts , Unstoppble Season2 , Show Host,balakrishna Remuneration-వామ్మో.. అన్ స్టాపబుల్ సీజన్ 2కు బాలయ్య పారితోషికం అన్ని కోట్లా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య ఒక్కో సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సినిమాలతో పోల్చి చూస్తే పావు వంతు రెమ్యునరేషన్ కు షోకు హోస్ట్ గా చెయ్యడానికి బాలయ్య ఓకే చెప్పారు.

Telugu Aha Ott, Allu Arvind, Balakrishna, Chiranjeevi, Nagarjuna, Show, Venkatesh-Movie

అల్లు అరవింద్ తో ఉన్న అనుబంధం కూడా బాలయ్య ఈ షో హోస్ట్ చెయ్యడానికి కారణమని సమాచారం.బాలయ్య హోస్ట్ గా చేయబోతున్న ఈ షోకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హాజరు కానున్నారని బోగట్టా. బాలయ్య తారక్ ను ఒకే స్టేజ్ పై చూడాలని అభిమానులు కోరుకుంటున్నా గత కొన్నేళ్లుగా సాధ్యం కాలేదు.అన్ స్టాపబుల్ షో ద్వారా ఇది సాధ్యం అవుతుందేమో చూడాల్సి ఉంది.

అన్ స్టాపబుల్ షో బాలయ్య కెరీర్ కు మాత్రం ప్లస్ అయిందని చెప్పవచ్చు.ఈ షోకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి పని చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్యకు బుల్లితెర నిర్వాహకుల నుంచి టీవీ షోలకు హోస్ట్ గా చెయ్యడానికి ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube